Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి వచ్చిన సింహం.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Sep 13 , 2024 | 02:08 PM

పులులు, సింహాలు జనావాసాల్లోకి చొరబడడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు జనాలను భయంభ్రాంతులకు గురి చేసి పారిపోయేలా చేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి వచ్చిన సింహం.. చివరకు ఏం జరిగిందో చూడండి..

పులులు, సింహాలు జనావాసాల్లోకి చొరబడడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు జనాలను భయంభ్రాంతులకు గురి చేసి పారిపోయేలా చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సింహానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అడవిలో నుంచి నివాస ప్రాంతంలోకి వచ్చిన ఓ పెద్ద సింహం.. చివరకు ఓ పెట్రోల్ బంక్‌లోకి దూరిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద సింహం అడవి నుంచి అర్ధరాత్ర వేళ జనావాల్లోకి చొరబడింది. అటూ, ఇటూ తిరిగిన ఆ సింహం.. చివరకు (lion came into petrol bunk) ఓ పెట్రోల్ బంకులోకి చొరబడింది. ఎంతో గంభీరంగా నడుస్తూ వచ్చిన సింహం.. పెట్రోల్ బంక్‌లోకి దూరి తాపీగా నడుస్తూ మళ్లీ రోడ్డుపైకి వెళ్లింది.

Viral Video: రే.. ఏంట్రా.. ఇదీ.. బైకుతో ట్రైన్ లాగాలని చూశాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది దాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ సింహం చివరకు లోపలికి రాకుండా.. మళ్లీ రోడ్డు పైకి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి సమయం కావడం, అక్కడ వాహనాలు కానీ.. మనుషులు కానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుయింది.

Viral Video: ఆగిపోయిన కారును ఇలా ఎవరైనా తోస్తారా.. ఈ వ్యక్తి నిర్వాకానికి అవాక్కవుతున్న నెటిజన్లు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చిందేమో’’.. అంటూ కొందరు, ‘‘సింహం సింగల్‌గా రావడం అంటే ఇదేనమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 02:08 PM

Advertising
Advertising