Viral Video: అది రైలు అనుకున్నారా.. లేక పార్క్ అనుకున్నారా.. బోగీపై ఈ ప్రేమికుల నిర్వాకం చూస్తే..
ABN, Publish Date - Aug 11 , 2024 | 07:35 AM
ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రేమికుల ప్రవర్తన అందరికీ ఆగ్రహం తెప్పించేలా ఉంటోంది. పార్కులు, రోడ్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ప్రదేశం ఏదైనా వారి ప్రవర్తన మాత్రం ఒకేలా ఉంటోంది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ..
ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రేమికుల ప్రవర్తన అందరికీ ఆగ్రహం తెప్పించేలా ఉంటోంది. పార్కులు, రోడ్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ప్రదేశం ఏదైనా వారి ప్రవర్తన మాత్రం ఒకేలా ఉంటోంది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, రైలు బోగీలపై ప్రేమికుల నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అది రైలు అనుకున్నారా.. లేక పార్క్ అనుకున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ప్రేమికులు బైకులు, బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తున్నాం. తాజాగా, ఓ ప్రేమ జంట వెరైటీగా రైలు బోగీలపై పార్కు తరహాలో నడిచి అంతా అవాక్కయ్యేలా చేశారు. ఓ రైలు ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Viral Video: అరే.. మరీ విచిత్రంగా ఉందే.. దూసుకెళ్తున్న లారీ.. ఇంజిన్‌లో చూడగా ఫ్యూజులు ఎగిరే సీన్..
రైలు బోగీలపై ఓ ప్రేమ జంట తాపీగా (Lovers walking on train bogies) నడుస్తూ కనిపించింది. పార్క్‌లో ఎలాగైతే వాకింగ్ చేస్తారో.. అచ్చం అలాగే వీరిద్దరూ రైలు బోగీలపై ఓ వైపు నుంచి మరో వైపునకు నడుస్తూ వెళ్లారు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఓ చోట పక్కపక్కనే కూర్చుని సరసాలు ఆడుతూ కనిపించారు. వీరిని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలా ఆ ప్రేమ జంట చాలా సేపు రైలు బోగీలపైనే గడిపింది.
Viral Video: రైల్లో ఇలాంటి పని ఇంతవరకూ ఎవరూ చేయలేదేమో.. డోరు వద్ద ఇతడు చేస్తున్న పని చూస్తే..
అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రేమ గుడ్డిది అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..
Updated Date - Aug 11 , 2024 | 07:35 AM