Viral Video: ఇతడెవరో గానీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. ఆటో పడిపోతున్నా.. ఆ పని మాత్రం ఆపలేదుగా..
ABN, Publish Date - Dec 18 , 2024 | 09:51 AM
సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు విన్యాసాలు చేస్తూ తెలిసి ప్రమాదానికి గురైతే.. మరికొందరు ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే తాజాగా, ప్రమాద సమయంలో విచిత్రంగా ప్రవర్తించిన వ్యక్తికి సంబంధించిన వీడియో..
సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు విన్యాసాలు చేస్తూ తెలిసి ప్రమాదానికి గురైతే.. మరికొందరు ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే తాజాగా, ప్రమాద సమయంలో విచిత్రంగా ప్రవర్తించిన వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆటో పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా రోడ్డుపై డాన్స్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘ఆటో పడిపోతున్నా.. ఆ పని మాత్రం ఆపలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొంత మంది ప్రయాణికులు ఓ షేరింగ్ ఆటోలో (Sharing Auto) వెళ్తుంటారు. ఆటో డ్రైవర్ పాటలు ప్లే చేయగానే ఓ వ్యక్తి కూర్చునే (man dancing in auto) డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆటోలో ఉన్న వారంతా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. పాటలు వినే క్రమంలో ఆటో డ్రైవర్ అత్యుత్సాహంతో వాహనాన్ని అటూ, ఇటూ మళ్లిస్తూ ప్రమాదకరంగా నడుపుతుంటాడు.
Viral Video: వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా.. రైలు పట్టాలపై అసభ్యకరంగా ఈమె చేసిన పని చూడండి..
ఆ సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి డాన్స్ చేస్తూనే ఉంటాడు. అయితే కాస్త దూరం వెళ్లగానే ఆటో అదుపు తప్పి ధబేల్‌మని కిందపడుతుంది. అయితే ఆటో కిందపడే సమయంలో డాన్స్ చేస్తున్న వ్యక్తి.. దాన్నుంచి చాకచక్యంగా బయటపడి రోడ్డుపై డాన్స్‌ను కంటిన్యూ చేస్తుంటాడు. మరోవైపు కిందపడిన ఆటోలో నుంచి పైకి లేచిన ప్రయాణికులు తమకు తగిలిన దెబ్బలు చూసుకుంటూ షాకవుతంటారు. ఈ వ్యక్తి మాత్రం అలా డాన్స్ చేస్తూనే ఉంటాడు. కాసేపటి తర్వాత పడిపోయిన ఆటో వద్దకు వెళ్లి పైకి లేపేందుకు సాయం చేస్తాడు.
Viral Video: నీళ్లు తాగుతున్న గేదెలు.. సడన్‌గా దూసుకొచ్చిన మొసలి.. చివరకు జరిగింది చూస్తే..
ఈ ఘటన మొత్తం వెనుక వాహనంలో వెళ్తు్న్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఆటో పడిపోతున్నా డాన్స్ మాత్రం ఆపలేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 1.85 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కాలువపై కూర్చున్న ప్రేమికులు.. మధ్యలో వచ్చిన మరో యువకుడు.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 18 , 2024 | 09:51 AM