Viral Video: మేడపై ఇలాంటి పనులు చేస్తుంటే జాగ్రత్త.. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..
ABN, Publish Date - Jul 17 , 2024 | 04:09 PM
పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో చోటు చేసుకునే అకాల మరణాలను చూస్తే.. అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇంకొందరు తమ అజాగ్రత్త కారణంగా కూడా ...
పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో చోటు చేసుకునే అకాల మరణాలను చూస్తే.. అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇంకొందరు తమ అజాగ్రత్త కారణంగా కూడా మృత్యువాతపడుతుంటారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో చూసి అంతా.. అయ్యో.. పాంపం.. ఎంత ఘోరం జరిగింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే ఈ వీడియో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ వ్యక్తి జెండా కర్రతో ఇంట్లోకి వస్తూ విద్యుత్ షాక్ (electric shock) కారణంగా చనిపోయిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంటిపై ఏదో పని చేసుకుంటుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..
ఇంటి చివర కింద ఉన్న ఓ నిచ్చెనను మేడ పైకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. నిచ్చెనను (ladder) కింద నుంచి పైకి తీసుకున్న అతను.. మేడపై పెట్టేందుకు ప్రయత్నించే క్రమంలో చూసుకోకుండా పైన వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు (High tension electric wires) తాకిస్తాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి అతడి శరీరంపై మంటలు వ్యాపిస్తాయి. చూస్తుండగానే అతను పైనుంచి నిచ్చెనతో పాటూ ధబేల్‌మని కిందపడిపోతాడు.
ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. విధి వక్రించడం అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చావు శత్రువుకు కూడా రాకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - Jul 17 , 2024 | 04:50 PM