Viral video: ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. మంటలను ఇతనెంత సింపుల్‌గా ఆర్పేశాడో చూడండి..
ABN, Publish Date - Jun 15 , 2024 | 05:51 PM
ప్రమాద సమయాల్లో కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పెద్ద పెద్ద ప్రమాదాలను సైతం చిన్న చిన్న చిట్కాలతో తప్పిస్తుంటారు. ఇలాంటి ..
ప్రమాద సమయాల్లో కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పెద్ద పెద్ద ప్రమాదాలను సైతం చిన్న చిన్న చిట్కాలతో తప్పిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాహనంలో ఉన్నట్టుండి చెలరేగిన మంటలను ఓ వ్యక్తి ఎంతో సింపుల్‌గా ఆర్పేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ వ్యక్తి మోటార్ బైకు రిక్షాతో వస్తుండగా సడన్‌గా పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు వ్యాపిస్తాయి. దీంతో భయపడి వాహనాన్ని రోడ్డుపై ఆపి, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తాడు. మంటలపై బకెట్‌తో నీళ్లు కొడుతుంటాడు. అయినా మంటలు మాత్రం కంట్రోల్ కావు. తర్వాత మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చి మంటలపై నీళ్లు చల్లి ఆర్పే ప్రయత్నం చేస్తాడు. అప్పటికీ మంటలు మాత్రం కంట్రోల్ కావు. చివరకు ఓ వ్యక్తి చేతిలో కోకాకోలా (Coca-Cola) బాటిల్‌తో అక్కడికి వస్తాడు.
Viral video: నిధి కోసం వెతుకుతుండగా బయటపడ్డ సంచి.. సడన్‌గా లోపలి నుంచి దూసుకొచ్చిన పాము.. చివరకు..
కోకాకోలా బాటిల్‌ను షేక్ చేసి కోక్ మొత్తాన్ని మంటలపై స్ప్రే చేస్తాడు. దీంతో ఒక్కసారిగా (man extinguishing fire with Coca-Cola) మంటలు ఆరిపోతాయి. దీంతో అక్కడున్న వారంతా.. హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.., ‘‘కూల్‌డ్రింక్‌తో మంటలు ఆర్పొచ్చని ఇప్పుడే తెలిసింది’’.., ‘‘కూల్‌డ్రింక్స్‌లో మంటలను ఆర్పే గుణం ఉంటుంది’’.., ‘‘సమయానికి స్పందించి.. ప్రమాదాన్ని అరికట్టాడు’’.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - Jun 15 , 2024 | 05:51 PM