ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అరటి, యాపిల్, జామపండుతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..

ABN, Publish Date - Oct 13 , 2024 | 07:37 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చిత్ర విచిత్ర రెసిపీలతో వంట చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం అతను అరటిపండు, యాపిల్, జామపండును తీసుకున్నాడు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేటులో సిద్ధం చేసుకున్నాడు. తర్వాత..

వివిధ రకాల రెసిపీలను మిక్స్ చేస్తూ చిత్రవిచిత్ర వంటకాలను చేసే వారిని తరచూ చూస్తుంటాం. కొందరు ఉపాధిలో భాగంగా కస్టమర్లను ఆకట్టకునేందుకు ఇలా చేస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి అరటి, యాపిల్, జామపండును మిక్స్ చేసి తయారు చేసిన వంట చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చిత్ర విచిత్ర రెసిపీలతో వంట చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం అతను అరటిపండు, యాపిల్, జామపండును (Banana, apple, guava) తీసుకున్నాడు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేటులో సిద్ధం చేసుకున్నాడు. తర్వాత పాన్‌పై జున్ను వేసి వేడి చేశాడు. ఆ తర్వాత పండ్ల ముక్కలను అందులో వేసి మిక్స్ చేశాడు.

Viral Video: అరటిపండును ఎలా తినాలో.. ఈ కోతిని చూసి నేర్చుకోవాల్సిందే..


ఆపై అమూల్ క్రీమ్ వేసి పండ్ల ముక్కలను బాగా మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత కొద్దిగా నీరు, నల్ల మిరియాలు, వివిధ రకాల దినుసులు కలిపేస్తాడు. మళ్లీ వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత పాన్‌లో పాలు కూడా పోశాడు. ఇలా ఫైనల్‌గా ఆ పండ్ల ముక్కలన్నీ చివరకు జ్యూస్‌ తరహాలో మారిపోయాయి. చివరగా అందులో చీజ్‌తో నింపిన మోమోస్‌ను (momos) నింపి, కస్టమర్లకు వడ్డించాడు. వీటిని తిన్న వారు కొంతమంది అద్భుతం అని ప్రశంసించగా.. మరికొంత మంది బాబోయ్.. ఇవెక్కడి మోమోస్‌రా బాబోయ్ ... అంటూ అతడిపై మండిపడుతున్నారు.

Viral Video: గజరాజా మజాకా.. ఈ ఏనుగు దూరం నుంచే సింహాలను ఎలా భయపెట్టిందో చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మోమోస్ తింటే పైప్రాణాలు పైన్నే పోతాయేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇతన్ని అస్సలు క్షమించకూడదు’’.. అంటూ మరికొందరు, ‘‘నరకంలో ఇతడికి ఇలాంటి శిక్షే పడుతుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఎల్‌ఈడీ బల్బుకు హైసెక్యూరిటీ.. వీళ్ల అతి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 07:37 PM