ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Love Story: స్నేహితుడు పిలిచాడని ఆస్పత్రికి వెళ్లాడు.. రాత్రికి రాత్రే అమ్మాయిగా మారాడు.. చివరకు..

ABN, Publish Date - Jun 21 , 2024 | 04:50 PM

ప్రేమ వ్యవహారాల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నేలా ప్రేమ కథలు అనేక మలుపులు తిరుగుతుంటాయి. ప్రేమించిన వారిని సొంతం చేసుకునేందుకు చాలా మంది...

ప్రేమ వ్యవహారాల్లో సినిమా తరహా ట్విస్ట్‌లు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నేలా ప్రేమ కథలు అనేక మలుపులు తిరుగుతుంటాయి. ప్రేమించిన వారిని సొంతం చేసుకునేందుకు చాలా మంది శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రేమ కథలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా, ఓ విచిత్ర ప్రేమ కథకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన స్నేహితుడు పిలిచాడని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి చేసిన నిర్వాకంతో రాత్రికి రాత్రే అమ్మాయిగా మారిపోయాడు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మన్సూర్‌పూర్‌లోని బేగ్‌రాజ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ముజఫర్ నగర్‌కు చెందిన ఓం ప్రకాష్‌కు రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ముజాహిద్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. తరచూ ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. అయితే ఈ క్రమంలో ఓ ప్రకాష్.. విచిత్రంగా ముజాహిద్‌పై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Viral video: వధువు ముందు వరుడి గాలి తీసిన వ్యక్తి.. డాన్స్ చేస్తుండగా.. అతడు చేసిన నిర్వాకం..


అయితే ముజాహిద్‌ అబ్బాయి కావడంతో ఏదోటి చేసి అతన్ని అమ్మాయిగా మార్చాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయం బయటపడకుండా అతడితో పైకి రోజూలాగే స్నేహంగా ఉండేవాడు. ఈ క్రమంలో ముజాహిద్‌ అనారోగ్యానికి గురవడడంతో తనకు తెలిసిన వైద్యుల వద్ద చికిత్స చేయిస్తానని చెప్పాడు. జూన్ 3న ముజాహిద్‌‌ను మన్సూర్‌పూర్‌లోని బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాడు. అప్పటికే వైద్యులతో మాట్లాడి ముజాహిద్‌ను అమ్మాయిగా మార్చేందుకు ఏర్పాట్లు చేశాడు. అనుకున్న విధంగా అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగానే (anesthetic injection) మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, రాత్రికి రాత్రే ఆపరేషన్ (male to female surgery) చేసి అతడి అవయవాలు తొలగించి అమ్మాయిగా మార్చేశారు.

Viral video: తల్లి ఊయల ఊపుతుండగా.. లోపలికి వచ్చిన అనుకోని అతిథి.. చివరకు..


ఉదయం తనని తాను చూసుకున్న ముజాహిద్ షాక్ అయ్యాడు. ఎందుకిలా చేశారంటూ వైద్యులతో గొడవపడ్డాడు. చివరకు తన స్నేహితుడే ఇదంతా చేశాడని తెలుసుకుని.. ఓం ప్రకాష్‌ను కూడా నిలదీశాడు. తానే ఇదంతా చేశానని అంగీకరించిన ఓం ప్రకాష్.. ముజాహిద్‌ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని, తాను చెప్పినట్లు ఒప్పుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ముజాహిద్ ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు.

Viral video: రైలు దిగే సమయంలో ఇలాంటి తప్పు ఎవరూ చేయొద్దు.. ఇతడు చేసిన పని చూడండి..


ఓం ప్రకాష్ బెదిరించడంతో భయపడ్డ ముజాహిద్ చాలా రోజులు అలాగే భరించాడు. చివరకు 16వ తేదీన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ ప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. అలాగే ఆపరేషన్ చేసిన వైద్యులు, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముజాహిద్ మాట్లాడుతూ తన జీవితాన్ని నాశనం వారందరినీ కఠినంగా శిక్షించాలని, అలాగే తనకు నష్టపరిహారం కింద రూ.2కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

Viral video: ఆపరేషన్ చేస్తుండగా వైద్యులకే షాక్ ఇచ్చిన మహిళ.. మధ్యలో ఉన్నట్టుండి..

Updated Date - Jun 21 , 2024 | 05:38 PM

Advertising
Advertising