Viral Video: ఏకంగా రైలు బోగీలపైనే దుకాణం పెట్టేశాడుగా.. ఇతడు చేస్తున్న పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Nov 19 , 2024 | 08:05 PM
రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయ్యేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి..
రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయ్యేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి రైలు బోగీలపై చేస్తున్న నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఏకంగా రైలు బోగీలపైనే దుకాణం పెట్టేశాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ప్రజలు రైలు బోగీ పైన కూర్చుని ప్రయాణం చేస్తుంటారు. వారిలో కొందరు చిన్న పిల్లలు బోగీపై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణం చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ చిరు వ్యాపారి ఇక్కడ కూడా తన వ్యాపారాన్ని వదల్లేదు. ఏకంగా బోగీపైకి వచ్చేసి ప్రయాణికుల మధ్యలో కూర్చుని భేల్‌పూరీని విక్రయించడం స్టార్ట్ చేశాడు.
Viral Video: ఉడుము పవర్ అంటే ఇదీ.. నాగుపామును పట్టుకోగానే ఏం జరిగిందో చూస్తే..
రైలు వేగంగా వెళ్తున్నా కూడా తన బుట్టలోని బొరుగులు, ఉల్లిపాయ, టమోటా.. (man selling bhel puri on train bogie) ఇలా అన్నింటినీ ఎంతో మిక్స్ చేసి, ప్రయాణికులకు అందిస్తున్నాడు. ఈ క్రమంలో కొంచెం బ్యాలెన్స్ తప్పినా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయినా ఆ వ్యక్తం ఎంతో చాకచక్యంగా భేల్‌పూరీని విక్రయిస్తున్నాడు. గతంలో చాలా మంది ఇలా రైలుపై విచిత్రమైన పనులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఘటనలు చూశాం.
ఓ ప్రేమ జంట రైలు బోగీపై కూర్చుని అందరికీ షాక్ ఇచ్చిన ఘటనను చూశాం. ఇంజిన్‌కు ముందు వైపు కూర్చుని ప్రమాకరంగా ప్రయాణం చేసిన వారిని కూడా చూశాం. తాజాగా, రైలు బోగీపై భేల్‌పూరీ చేసిన వ్యాపారి వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వ్యాపారి ఏ అవకాశాన్నీ వదిలేలా లేడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలాంటి పరిస్థితిలోనైనా సరే.. వ్యాపారం మాత్రం ఆగొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 49 వేలకు పైగా లైక్‌లు, 3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 19 , 2024 | 08:05 PM