ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రైల్లో ఇలాంటి పని ఇంతవరకూ ఎవరూ చేయలేదేమో.. డోరు వద్ద ఇతడు చేస్తున్న పని చూస్తే..

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:45 PM

సోషల్ మీడియాలో రైలు ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. రన్నింగ్ రైలు ఎక్కుతూ కొందరు, రైలు పైన పడుకుని మరికొందరు ప్రయాణం చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇలాంటి...

సోషల్ మీడియాలో రైలు ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. రన్నింగ్ రైలు ఎక్కుతూ కొందరు, రైలు పైన పడుకుని మరికొందరు ప్రయాణం చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలు డోరు వద్ద నిలబడి చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆగి ఉన్న రైల్లో అంతా ఎవరి సీట్లో వారు కూర్చుని ఉంటే.. ఓ యువకుడు మాత్రం డోరు వద్దకు వచ్చి నిలబడ్డాడు. అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న (Man flying kite while standing train door) గాలిపటాన్ని బయటికి తీసి, అక్కడి నుంచి గాల్లోకి వదిలాడు.

Viral Video: ఆవునే కదిలించిన చిన్నారి.. ఎదరుగా మైక్ పెట్టగానే.. ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇలా చివరకు గాలిపటాన్ని ఆకాశంలోకి పంపించి, దారం సాయంతో అక్కడి నుంచే కంట్రోల్ చేస్తున్నాడు. ఈ విధంగా అతను చాలా సేపు అక్కడ నిలబడి, చిన్న పిల్లల తరహాలో గాలిపటంతో ఆడుకోవడం కనిపించింది. ఈ యువకుడు చేసిన నిర్వాకానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయిరా బాబూ.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం వల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’.. అంటూ మరికొందరు, ‘‘రైలు కదిలితే ఈ గాలిపటం పరిస్థితి ఏంటో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

Updated Date - Aug 10 , 2024 | 12:45 PM

Advertising
Advertising
<