ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కాలు జారి జలపాతంలో పడ్డ యువకుడు.. అంతెత్తునుంచి కొట్టుకొచ్చినా..

ABN, Publish Date - Jul 23 , 2024 | 06:13 PM

అదృష్టం సరిగా లేకుంటే... నడుస్తూ వెళ్తున్నా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అదే అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

అదృష్టం సరిగా లేకుంటే.. నడుస్తూ వెళ్తున్నా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అదే అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు జలపాతం పైనుంచి జారిపడ్డాడు. అంతెత్తు నుంచి కొట్టుకొచ్చినా.. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జలపాతాల వద్ద స్నానాలు చేస్తూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యువకుడి విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఓ పెద్ద జలపాతం వద్ద యువకుడు స్నానాలు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జలపాతం పైన ఉండగా.. (man fell from the top of waterfall) ప్రమాదవశాత్తు కాలు జారి కిందకు పడిపోయాడు.

Viral Video: ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


నీళ్లతో పాటూ రాళ్లపై పల్టీలు కొట్టుకుంటూ కిందకు దూసుకొచ్చాడు. పూర్తిగా కిందకు వచ్చిన దూసుకొచ్చి ఓ నీటి గుంటలో పడి ఆగిపోతాడు. మధ్యలో రాళ్లకు ఢీకొట్టుకుంటూ వచ్చినా.. ఆశ్చర్యకరంగా అతడికి ఎలాంటి రక్తగాయాలూ కాలేదు. కేవలం స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అతడు కిందపడడాన్ని గమనించిన వారు సమీపానికి వెళ్లి అతన్ని పైకి లేపి పక్కకు తీసుకొస్తారు.

Viral Video: ఇలాంటి బస్సులు కూడా ఉన్నాయా.. కిటికీ నుంచి ఎక్కుతుండగా.. ఒక్కసారిగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టైం చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘జలపాతాల వద్ద స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జాతరలో రద్దీ జనం మధ్య జంట విచిత్ర నిర్వాకం.. ముద్దులు పెట్టుకుంటూ..

Updated Date - Jul 23 , 2024 | 07:18 PM

Advertising
Advertising
<