Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Jun 19 , 2024 | 06:08 PM

ప్రస్తుత సమాజంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇట్టే మోసం చేసేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. కొందరు చేసే మోసాలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి..

Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

ప్రస్తుత సమాజంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇట్టే మోసం చేసేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. కొందరు చేసే మోసాలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి విచిత్ర మోసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి రైలు ప్రయాణ సమయంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి రైల్లో విక్రయిస్తున్న పవర్ బ్యాంక్‌ను కొన్నాడు. అయితే తీరా అనుమానం వచ్చి దాన్ని తెరచి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణం (train journey) అందరికీ ఆహ్లాదకరమైన ఫీలింగ్‌ను కలిగిస్తే.. ఓ వ్యక్తికి మాత్రం షాకింగ్ అనుభవాన్ని మిగిల్చింది. రైల్లో వెళ్తున్న సదరు వ్యక్తి ఫోన్‌లో చార్జింగ్ అయిపోవచ్చింది. అదే సమయంలో ఓ చిరు వ్యాపారి ఫోన్ పవర్ బ్యాంక్‌లు (Power bank) విక్రయిస్తూ కనిపించాడు. దీంతో వెంటనే అతడి వద్ద నుంచి ఓ పవర్ బ్యాంక్ కొన్నాడు. అది ఒరిజినలా, కాదా.. అని అడుగుతాడు. అందుకు ఆ వ్యాపారి ఇది ఒరిజినల్ అని చెబుతాడు.

Viral video: పూల కుండీని తింటున్న యువతి.. ట్విస్ట్ ఏంటో తెలుసుకుని నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..


వ్యాపారి ఒరిజినల్ అని చెబుతున్నా కూడా.. కొన్న వ్యక్తికి ఎక్కడో అనుమానం మొదలవుతుంది. దీంతో చివరకు అందులో ఓ పవర్ బ్యాంక్‌ను తెరచి చూస్తాడు. చివరకు అందులో షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది. అందులో ఓ చిన్న బ్యాటరీ పెట్టి దానికి కనెక్షన్ ఇచ్చారు. పవర్ బ్యాంక్ పేరుతో జరిగిన మోసాన్ని చూసి ఆ యువకుడు ఖంగుతింటాడు. విషయం బయటపడగానే వ్యాపారి.. వాటిని లాక్కుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..


అయినా ఆ యువకుడు పవర్ బ్యాంక్‌లను వ్యాపారికి ఇవ్వకుండా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు’’.. అంటూ కొందరు, ‘‘పైన పటారం లోపల లొటారం.. అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..

Updated Date - Jun 19 , 2024 | 06:08 PM

Advertising
Advertising