ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కోతులను ఎలా కూల్ చేయాలో.. ఇతడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనుకుంటా..

ABN, Publish Date - Mar 23 , 2024 | 03:54 PM

కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు మనుషులతో స్నేహం చేస్తే.. మరికొన్నిసార్లు ఉన్నట్టుండి దాడులు చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చేతుల్లోని విలువైన వస్తువులను సైతం లాక్కెళ్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వాటిని తిరిగి తీసుకోవడం దాదాపు సాధ్యం కాదు. ఎక్కడైనా పడేస్తే..

కోతులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు మనుషులతో స్నేహం చేస్తే.. మరికొన్నిసార్లు ఉన్నట్టుండి దాడులు చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు చేతుల్లోని విలువైన వస్తువులను సైతం లాక్కెళ్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వాటిని తిరిగి తీసుకోవడం దాదాపు సాధ్యం కాదు. ఎక్కడైనా పడేస్తే తప్ప తిరిగి తీసుకోవడం కుదరదు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ.. కోతుల నుంచి వస్తువులను తిరిగి తీసుకుంటుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కళ్లద్దాలను లాక్కెళ్లిన కోతి నుంచి ఓ వ్యక్తి తిరిగి వాటిని తీసుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మధురలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు స్థానికంగా ఉన్న అనేక ఆలయాల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది. అయితే ఈ సమయంలో ఓ ఆలయం వద్ద తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి కళ్లద్దాలను కోతి ఎత్తుకెళ్లింది. చూస్తుండగానే ఓ ఆలయంపైకి ఎక్కి కూర్చుంది. కోతి చేసిన ఈ పనికి సదరు యువకుడితో పాటూ అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎలాగైనా కోతి (monkey) నుంచి కళ్లద్దాలను (spects ) తీసుకోవాలని అనుకున్నాడు. దీంతో సాధారణంగానే కోతికి ఇష్టమైన పళ్లు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ముందుగా ఓ కూల్ డ్రింక్ కోతి పైకి విసిరేశాడు. అది తీసుకున్న కోతి బాటిల్‌ను తేరిపారా చూసి.. ‘‘ఇది నాకు అవసరం లేదు.. నువ్వే తీసుకో’’.. అన్నట్లుగా తిరిగి కిందకు విసిరేస్తుంది.

Lovers: ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా సడన్‌గా మోగిన ఫోన్.. ఎవరో అని తొంగిచూసిన యువతి.. చివరకు..

దీంతో ఆ తర్వాత ఆపిల్ పండును విసిరేస్తారు. రెండు మూడు ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు పండును కోతి వద్దకు విసురుతారు. అయితే కోతికి ఆ పండు కూడా నచ్చనట్లుంది. ‘‘రోజూ తిని తిని బోరు కొట్టింది.. ఇది కూడా నాకొద్దు’’.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి అలాగే కూర్చుండిపోతుంది. కోతిని ఎలాగైనా మెప్పించాలని ఈసారి ఫ్రూటీ ప్యాకెట్‌ని విసురుతారు. దాన్ని అందుకున్న కోతి.. ‘‘వావ్..! ఫ్రూటీ ప్యాకెట్.. డీల్ ఓకే’’.. అన్నట్లుగా ప్యాకెట్ తీసుకోగానే.. కళ్లద్దాలను అతడికి తిరిగి ఇచ్చేస్తుంది. తర్వాత ప్యాకెట్‌లోని జ్యూస్ తాగుతూ తన కోరిక తీర్చుకుంటుంది. ఈ వీడియో (Viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫ్రూటీకి ఫిదా అయిన కోతి’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. వెరీ ఫన్నీ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కారు పార్కింగ్‌కు స్థలం లేదని చింతిస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే..

Updated Date - Mar 23 , 2024 | 03:54 PM

Advertising
Advertising