ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: బిడ్డ కోసం మొసలితో తలపడిన కోతి.. చివర్లో హృదయం ద్రవించే సీన్..

ABN, Publish Date - Mar 21 , 2024 | 07:44 PM

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. తల్లి ప్రేమ మాత్రంలో ఎలాంటి తేడా ఉండదు. తమ పిల్లలకు అపాయం ఎదురైతే తల్లి తల్లడిల్లిపోతుంది. అవసరమైతే తన ప్రాణం అడ్డు వేసైనా తన పిల్లలను కాపాడుకుంటుంది. అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుంది. ఇందుకు నిదర్శనంగా...

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. తల్లి ప్రేమ మాత్రంలో ఎలాంటి తేడా ఉండదు. తమ పిల్లలకు అపాయం ఎదురైతే తల్లి తల్లడిల్లిపోతుంది. అవసరమైతే తన ప్రాణం అడ్డు వేసైనా తన పిల్లలను కాపాడుకుంటుంది. అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుంది. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కోతి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు మొసలితో పోరాడింది. అయితే చివరకు హ‌ృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ సరస్సు వద్ద కొన్ని కోతులు నీరు తాగుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆహారం కోసం పొంచి ఉన్న మొసళ్లకు కోతి పిల్ల కనిపిస్తుంది. నీరు తాగుతున్న కోతి పిల్లను (Crocodile attack on baby monkey) నోట కరుచుకుని వెళ్లిపోతుంది. దీన్ని గమనించిన తల్లి కోతి తల్లడిల్లిపోతుంది. ఎలాగైనా తన పిల్లను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగిస్తుంది. మొసలిపైకి దూకి గోర్లతో దాన్ని రక్కేస్తుంది. అటూ ఇటూ తిప్పి చివరకు ఎలాగోలా దాని నోటి నుంచి బిడ్డను లాక్కుంటుంది.

Viral video: ప్రమాదం పొంచి ఉండడం అంటే ఇదేనేమో.. గోడౌన్‌లో మహిళ శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి..

అయితే అంత కష్టపడ్డా.. కోతి పిల్ల ప్రాణాలు మాత్రం దక్కలేదు. అప్పటికే కోతి పిల్ల చలనం లేకుండా ఉంటుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని అటూ, ఇటూ చూసి తల్లి కోతి ఎంతో విచారంగా ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకున్నా.. ఫలితం లేకుండా పోయిందే’’.. అంటూ కొందరు, ‘‘పిల్లల కోసం తల్లి ప్రాణాలకైనా తెగిస్తుందనడానికి ఇదే నిదర్శనం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Women: డెలివరీ బాయ్‌ను వాష్ రూంలోకి తీసుకెళ్లిన మహిళ.. కాసేపటికి వంటగదిలోకి వెళ్లగా..

Updated Date - Mar 21 , 2024 | 07:44 PM

Advertising
Advertising