Viral Video: చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కిన కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవుతారు..

ABN, Publish Date - Sep 19 , 2024 | 09:25 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుంటుంది. ఓ చేతిలో జ్యూస్ బాటిల్, మరో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని నడుస్తూ వస్తున్న ఆమెను.. సమీపంలో ఉన్న ఓ కోతి..

Viral Video: చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కిన కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవుతారు..

కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పర్యాటకుల చేతిలోని ఆహార పదార్థాలను లాక్కెళ్లడం, ఇళ్లల్లోకి దూరిమరీ వస్తువులను ఎత్తుకెళ్లడం, వాహనాల్లోకి దూరి బీభత్సం చేయడం తదితర ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అయితే వాటికి కావాల్సిన ఆహార పదార్థాలు తీసుకుని, పర్యాటకుల వస్తువులను తిరిగి ఇచ్చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ కోతి విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కోతి చంటి పిల్లాడిలా యువతి పైకి ఎక్కేసింది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుంటుంది. ఓ చేతిలో జ్యూస్ బాటిల్, మరో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని నడుస్తూ వస్తున్న ఆమెను.. సమీపంలో ఉన్న ఓ కోతి గమనిస్తుంది. యువతి చేతిలోని జ్యూస్ (Juice) బాటిల్‌పై కన్నేసిన కోతి (monkey) .. ఎలాగైనా దాన్ని తాగేయాలని ఫిక్స్ అవుతుంది.

Viral Video: బలమైన గాలికి పడిపోతున్న ట్రక్కు.. గమనించిన డ్రైవర్ చివరకు ఎవరూ ఊహించని విధంగా..


యువతి దగ్గరికి రాగానే.. సడన్‌గా ఆమె సమీపానికి వెళ్తుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకై.. అలాగే ఉండిపోతుంది. చూస్తుండగానే ఆ కోతి ఆమె చిన్న పిల్లల తరహాలో ఆమె కాళ్లు పట్టుకుని చకచకా పైకి ఎక్కేస్తుంది. చవరకు ఆమె చేతిపైకి ఎక్కి, జ్యూస్ బాటిల్‌కు ఉన్న స్ట్రా నోట్లో పెట్టుకుని తాగేస్తుంది. ఇలా ఆమె చేతిపై కూర్చుని తాపీగా జ్యూస్ మొత్తం తాగుతుంది. మొదట షాకైన ఆమె.. ఆ తర్వాత కోతి చేష్టలకు మురిసిపోయి.. అలాగే నవ్వుతూ చూస్తుండిపోతుంది. పనిలోపనిలా కోతితో సెల్ఫీలు కూడా దిగుతుంది.

Viral Video: రైల్లో వృద్ధుడి కోతి చేష్టలు.. డోరు వద్ద అతడు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది మరీ చిలిపి కోతిలా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘కోతి దౌర్జన్యం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 09:25 PM

Advertising
Advertising