Viral Video: స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు.. ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN, Publish Date - Aug 22 , 2024 | 09:45 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కోతుల సమూహానికి జలకాడాలని కోరిక పుట్టినట్లుుంది. అయితే రొటీన్‌గా వంకలు, వాగులు, జలపాతాలు కాకుండా కొత్తగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాయి. ఇంతలో...

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు.. ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkeys Funny Video

కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకడం, ఇళ్లల్లోని వస్తువులను చూస్తుండగానే కొట్టేయడం, ఆఖరికి మనుషుల చేతిలోని ఆహార పదార్థాలను తెలివిగా లాక్కోవడం వంటి చేష్టలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుతుగుతుంటుంది. అలాగే కోతులు కొన్నిసార్లు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు కూడా చూసేందుకు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతుల మంద.. చివరకు అక్కడ చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కోతుల సమూహానికి జలకాడాలని కోరిక పుట్టినట్లుుంది. అయితే రొటీన్‌గా వంకలు, వాగులు, జలపాతాలు కాకుండా కొత్తగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాయి. ఇంతలో వాటికి మనుషులంతా కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేయడం, పైనుంచి దూకడం వంటి దృశ్యాలు గుర్తుకువచ్చాయి. అచ్చం అలాగే ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుని ఓ స్విమ్మింగ్‌పూల్‌ను సెలెక్ట్ చేసుకున్నారు.

Viral Video: వామ్మో.. ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోతే ఇలా ఉంటుందా.. ఈ జంతువుల పరిస్థితి చూస్తే..


ఎవరూ లేని సమయంలో చూసి దాన్ని ఆక్రమించేశాయి. జలకాలాడడమే కాకుండా అక్కడ ఉన్న ఓ పెద్ద గొడగు పైకి ఎక్కేశాయి. అక్కడి నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా పైనుంచి నీళ్లలోకి దూకేశాయి. ఇలా దూకిన కోతులు.. ‘‘అరే.. ఇదేదో బాగుందే.. మళ్లీ దూకుదాం’’.. అని అనుకుంటూ మళ్లీ మళ్లీ ఆ గొడుగు పైకి ఎక్కి దూకడం స్టార్ట్ చేశాయి. కొన్ని కోతులు పైనుంచి దూకే ధైర్యం చేయలేక.. భయం భయంగా చూస్తుండిపోయాయి. అయితే అచ్చం మనుషుల తరహాలోనే కొన్ని కోతులు అక్కడికి వచ్చి, భయపడుతున్న కోతులను బలవంతంగా నీటిలోకి తోసేశాయి.

Viral Video: వామ్మో.. గూజ్‌బమ్స్ తెప్పించే వీడియో.. నక్కను వేటాడిన డేగ.. చివరికి..


ఇలా ఆ కోతులన్నీ కలిసి చాలా సేపు అలా ఈత కొడుతూ ఎంజాయ్ చేశాయి. కోతులు అలా విచిత్రంగా జలకాలాడడం చూసి అక్కడున్న వారంతా వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతులు స్విమ్మింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా ఎంజాయ్ అంటే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 06:17 PM

Advertising
Advertising
<