ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: తల్లి ప్రేమకు ఇంతకంటే సాక్షం.. ఇంకేమైనా ఉంటుందా.. పాపం..! ఈ తల్లి పక్షి..

ABN, Publish Date - Jun 01 , 2024 | 09:46 PM

తల్లి ప్రేమకు సాటి ఈ సృష్టిలో మరేదీ లేదు. మనుషులైనా, జంతువులైనా.. ఆఖరికి విష సర్పాలలో అయినా తల్లి ప్రేమలో మాత్రం తేడా ఉండదు. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లులు ఉంటారో లేదో...

తల్లి ప్రేమకు సాటి ఈ సృష్టిలో మరేదీ లేదు. మనుషులైనా, జంతువులైనా.. ఆఖరికి విష సర్పాలలో అయినా తల్లి ప్రేమలో మాత్రం తేడా ఉండదు. పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లులు ఉంటారో లేదో గానీ.. జంతువులు, పక్షులు మాత్రం ఈ విషయంలో వెనుకాడవు. ఇందుకు సాక్షంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘తల్లి ప్రేమకు ఇంతకంటే సాక్షం.. ఇంకేమైనా ఉంటుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎండ వేడి కారణంగా ఇలా జరిగిందో, లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో గానీ ఓ తెల్లటి పక్షి తన పిల్లను రెక్కల కింద దాచుకుని పడుకుని ఉంటుంది. అయితే తల్లి పక్షిలో ఎలాంటి చలనం లేకపోవడంతో అక్కడున్న కొందరు గమనించి సమీపానికి వెళ్తారు. తల్లి పక్షిని (mother bird) పట్టుకుని పక్కకు తీయగా అప్పటికే అది చనిపోయి ఉంటుంది.

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..


తల్లి పక్షి రెక్కల కింద పిల్ల పక్షి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. పరిస్థితి చూస్తుంటే.. తన పిల్లను కాపాడేందుకు ఈ తల్లి పక్షి ప్రాణాలను త్యాగం చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర భావేద్వేగానికి గురవుతున్నారు. ‘‘తల్లి ప్రేమకు ఇంతకంటే సాక్షం ఉంటుందా’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో..పాపం.. ఎంత ఘోరం’’.. అంటూ మరికొందరు, ‘‘చూస్తుంటే ఎంతో బాధంగా ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..

Updated Date - Jun 01 , 2024 | 09:46 PM

Advertising
Advertising