ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిల్లతో కలిసి నదిలోకి దిగిన తల్లి ఏనుగు.. సడన్‌గా హిప్పోల రాకతో మారిన సీన్.. చివరకు..

ABN, Publish Date - Jul 19 , 2024 | 07:34 PM

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ జోలికి వచ్చిన జంతువులను తరిమి తరిమి కొడుతుంటాయి. అందుకే ఎలాంటి జంతువులైనా ఏనుగులను చూడగానే భయంతో పారిపోతుంటాయి. చివరకు..

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ జోలికి వచ్చిన జంతువులను తరిమి తరిమి కొడుతుంటాయి. అందుకే ఎలాంటి జంతువులైనా ఏనుగులను చూడగానే భయంతో పారిపోతుంటాయి. చివరకు పులులు, సింహాలు కూడా వాటి జోలికి వెళ్లే సాహసం చేయవు. ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లతో కలిసి తల్లి ఏనుగు నదిలో ఉండగా.. హిప్పోలు దాడికి దిగాయి. దీంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పిల్ల ఏనుగుతో కలిసి ఓ తల్లి ఏనుగు నదిలోకి దిగి జలాకాలాడుతుంటుంది. కాసేపటి తర్వాత రెండు హిప్పోలు అక్కడికి వస్తాయి. పిల్ల ఏనుగుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో తల్లి ఏనుగుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. తన దంతాలతో రెండు (elephant attacked the hippos) హిప్పోలను ఒక్క పోటు పోడిచి, తొండంతో దాడి చేస్తుంది.

Viral Video: డాన్సర్ పైశాసికత్వం.. వేదికపై కోడిని పట్టుకుని అతడు చేసిన నిర్వాకం..


ఏనుగు దెబ్బకు రెండు హిప్పోలు తోక ముడిచి అక్కడి నుంచి పరారవుతాయి. తర్వాత పిల్ల ఏనుగును జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘హిప్పోలకు చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 19 , 2024 | 07:34 PM

Advertising
Advertising
<