Viral News: వయస్సు 23.. పిల్లలు 24.. మహిళ సంచలన రికార్డు
ABN , Publish Date - Sep 25 , 2024 | 03:59 PM
ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే.
ఇంటర్నెట్ డెస్క్: ఒకరిద్దర్ని కని వారిని పోషించి, ఉన్నతంగా తీర్చిదిద్దడమే కష్టంగా మారిన ఈ సమాజంలో ఏకంగా ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు 50 పదుల వయస్సు ఉంటుందిలే అనుకునేరూ. ఆమె ప్రస్తుత వయస్సు 23 ఏళ్లే. దేవుడు ఇస్తున్నాడు, మేం తీసుకుంటున్నాం అంటున్న ఆ దంపతులు ఇదంతా తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆమె 12సార్లు ఆమె గర్భం దాల్చగా.. ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు.
సదరు వనితతో ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ హమ్ దో.. హమారా దో డజన్ అంటూ ఏకంగా 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంబేడ్కర్‌నగర్ కు చెందిన ఖుష్బు పాఠక్ అనే మహిళ 16 మంది ఆడపిల్లలకు 8 మంది మగ పిల్లలకు జన్మనిచ్చింది. అంతమంది పిల్లలను పొందిన తాను భాగ్యలక్ష్మిని అని చెబుతోంది. దేవుడు ఇస్తున్నాడు తాను తీసుకుంటున్నానని హర్షం వ్యక్తం చేస్తోంది.
భర్త ఉద్యోగమిదే..
పిల్లల పేర్లు గుర్తుంచుకోవడానికి వన్, టూ, త్రి, ఫోర్, ఫైవ్ అని నంబర్లతో పిలుస్తున్నామని సదరు మహిళ చెప్పింది. అయితే ఆధార్ కార్డులలో మాత్రం వేరే పేర్లు ఉన్నాయని తెలిపింది. వీరిలో 17 మంది బడికి వెళ్తున్నారని.. మిగిలిన వారు ఇంటి దగ్గరే ఉంటున్నారని వెల్లడించింది. ఇంత మంది పిల్లల్ని కని వారిని పోషిస్తున్నారంటే ఆమె భర్త తప్పకుండా ఏదో మంచి బిజినెస్సో, ప్రభుత్వ ఉద్యోగమో చేస్తున్నారనుకునేరు. ఆయన ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్ మాత్రమే. ట్యాక్సీ నడపగా వచ్చిన డబ్బులతోనే 24 మంది పిల్లలను పోషిస్తున్నారని ఆయన భార్య చెబుతోంది.
పిల్లలను తామెప్పుడు భారంగా భావించలేదని.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్లు చెప్పింది. ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పిల్లల్ని కనాలని ప్రోత్సహిస్తున్న చైనా సహా పలు దేశాలు ఈమెను బ్రాండ్ అంబాసిడర్ చేయాలని ఫన్నీగా స్పందిస్తున్నారు. ఒకరిద్దరు పిల్లలనే భారం అనుకుంటున్న తల్లిదండ్రులున్న ఈ కాలంలో ట్యాక్సీ నడుపుతూ వచ్చిన డబ్బులతో అంతమందిని పోషిస్తుండటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని ఇంకొందరు అంటున్నారు.
For Latest News and National News Click here