ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: గుండెల్ని పిండేస్తున్న వీడియో.. చనిపోయిన కుక్క పిల్లను నోట కరుచుకున్న కుక్క.. చివరకు..

ABN, Publish Date - May 12 , 2024 | 09:46 AM

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషుల్లాగే బాధపడుతూ అందరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి..

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషుల్లాగే బాధపడుతూ అందరినీ కంటతడి పెట్టిస్తుంటాయి. ఇలాంటి హృదయ విదారక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క పిల్ల చనిపోవడంతో తల్లి కుక్క తల్లడిల్లిపోయింది. చివరకు అది చేసిన పని చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కళ్ల ముందే పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్ల బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. అలాగే జంతువులు కూడా తమ పిల్లల పట్ల అంతే ప్రేమను చూపిస్తుంటాయి. దురదృష్టవశాత్తు పిల్లలు చనిపోయిన సందర్భాల్లో అవి ప్రవర్తించే తీరు అందరినీ కంటతటపెట్టిస్తుంటుంది. తాజాగా, ఓ కుక్కను చూసి నెటిజన్లు అయ్యో.. పాపం..! అని అంటున్నారు.

Viral Video: మేకతో సెల్ఫీ దిగిన యువతి.. చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..


కుక్క పిల్ల చనిపోవడం చూసి తల్లి కుక్క ఎంతో బాధపడింది. చివరకు దాన్ని నోట కరుచుకుని పొలాల్లోకి తీసుకెళ్లింది. నిర్మానుష్య ప్రదేశంలో కాళ్లతో మట్టి తీసి గుంత తవ్వింది. తర్వాత చనిసపోయిన తన పిల్లను అందులో ఉంచి, పైన కాళ్లతో (mother dog buried dead puppy) మట్టి పోసింది. గుంత నిండా మట్టి నింపి.. బరువైన హృదయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఇది చాలా బాధాకరం’’.. అంటూ కొందరు, ‘‘మనుషులైనా జంతువులైనా.. తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది’’. అంటూ మరికొందరు, బాధాకరమైన ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 12 , 2024 | 09:46 AM

Advertising
Advertising