ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బెత్తంతో బాదుతున్న ప్రిన్సిపాల్.. వీడియో చూస్తే ఫ్లాష్‌బ్యాక్ కనిపించడం ఖాయం..

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:41 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. చాలా మంది పెద్దవారు పిల్లల తరహాలో స్కూల్ యూనిఫామ్ ధరించారు. వారంతా భయపడుతూ వరసగా నిలబడి ఉన్నారు. వారి ముందు ప్రిన్సిపాల్ చేతిలో బెత్తం పట్టుకుని కోపంగా ఉన్నాడు. అతన్ని చూసి...

ప్రతి ఒక్కరికీ పాఠశాల రోజులు ఓ మధుర జ్ఞాపకం వంటివి. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుంటే ఉపాధ్యాయులు కొట్టే దెబ్బలు, ఆ బెబ్బలకు భయపడి జ్వరం పేరుతో పాఠశాలకు డుమ్మా కొట్టడం వంటి అనేక ఘటనలు జీవితాంతం మన వెంటే ఉంటూ సందర్భాన్ని బట్టి మనల్ని గతంలోకి తీసుకెళ్తుంటాయి. ప్రస్తుతం చాలా మంది.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో చిన్నప్పుడు చదివిన పాఠశాలలో తిరిగి కలుసుకోవడం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రిన్సిపాల్ తన పూర్వ విద్యార్థులను బెత్తంతో చితకబాదారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. చాలా మంది పెద్దవారు పిల్లల తరహాలో స్కూల్ యూనిఫామ్ ధరించారు. వారంతా భయపడుతూ వరసగా నిలబడి ఉన్నారు. వారి ముందు ప్రిన్సిపాల్ చేతిలో బెత్తం పట్టుకుని కోపంగా ఉన్నాడు. అతన్ని చూసి ఎదురుగా ఉన్న వారంతా మరింత భయపడుతున్నారు.

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..


ఇంతలో వారిని ఒకరితర్వాత ఒకరుగా దగ్గరికి పిలిచిన ప్రిన్సిపాల్.. బెత్తంతో (principal beating former students with stick) వారి పిర్రెల మీద బలంగా బాదేశాడు. దెబ్బకు వారు కుయ్యో ముర్రో.. అని చేతులతో రుద్దుకుంటూ చిన్న పిల్లల తరహాలో అక్కడి నుంచి పారిపోతున్నారు. ఇలా అక్కడున్న వారందరినీ ఆ ప్రిన్సిపాల్ బెత్తంతో చితకబాదాడు. ప్రిన్సిపాల్ కొడుతుంటే దెబ్బలు తింటున్న వారంతా ఓ వైపు కేకలు పెడుతూనే, మరోవైపు ఎంతో మురిసిపోవడం కనిపించింది. అసలు విషయంలోకి వెళితే.. అక్కడున్న వారంతా సామాన్యులు కాదు.

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..


అక్కడ బెత్తం దెబ్బలు తింటున్న వారిలో కలెక్టర్లు, పోలీసు అధికారులు, డాక్టర్లు, ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఉన్నారు. తమ చిన్నతనంలో చదివిన పాఠశాలలో ప్రస్తుతం వీరంతా మళ్లీ కలుసుకున్నారు. ఇలా, అప్పట్లో వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడి బెత్తం బెబ్బలను మళ్లీ గుర్తు చేసుకున్నారన్నమాట. ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ సీన్ చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జీవితాంతం మధుర జ్ఞాపకంలా ఉండిపోతాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అడుగు పెట్టగానే కుంగిపోయిన నేల.. లోపల తొంగిచూడగా దిమ్మతిరిగే సీన్..

Updated Date - Aug 16 , 2024 | 06:21 PM

Advertising
Advertising
<