ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: చిరుత పవర్‌కు లైవ్ ఎగ్జాంపుల్.. జింకను ఎలా వేటాడిందో చూస్తే ఖంగుతింటారు..

ABN, Publish Date - Oct 14 , 2024 | 10:12 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో కొన్ని జంకలు సమూహంగా మేత మేస్తుంటాయి. అదే సమయంలో వేట కోసం ఓ చిరుత పులి వెతుకుతూ ఉంటుంది. జింకలను చూడగానే చిరుత టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. చూస్తుండగానే మెరుపు వేగంతో..

వేగంగా పరుగెత్తే జంతువుల లిస్ట్‌లో చిరుతపులి ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి పరుగు మొదలెట్టిందంటే వేట సొంతమయ్యే వరకూ ఆపదు. మెరుపు వేగంతో పరుగులు పెడుతూ కళ్లు మూసి తెరిచే లోపు జంతువులను వేటాడేస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జింకను వేటాడిని చిరుత పులిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చిరుత పవర్‌కు లైవ్ ఎగ్జాంపుల్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో కొన్ని జంకలు సమూహంగా మేత మేస్తుంటాయి. అదే సమయంలో వేట కోసం ఓ చిరుత పులి వెతుకుతూ ఉంటుంది. జింకలను చూడగానే చిరుత టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. చూస్తుండగానే మెరుపు వేగంతో జింకల పైకి దూకుతుంది. చిరుత పులి దాడితో జింకలన్నీ అలెర్ట్ అయిపోయి దూరంగా పారిపోతాయి.

Viral Video: కారులో కూర్చుని ఖంగుతిన్న వ్యక్తి.. డోరు వేయాలని చూడగా.. షాకింగ్ సీన్..


అయితే వాటిలో ఓ జింకను టార్గెట్ చేసిన చిరుత.. (Leopard attack on deer) దానిపై తన పంజా విసురుతుంది. అయితే చిరుత నుంచి తప్పించుకునే క్రమంలో ఆ జింక గాల్లోకి ఎగిరి తప్పించుకోవాలని చూస్తుంది. అయితే చిరుత కూడా గాల్లోకి లేచి జింక మెడ పట్టుకుని నేలపై పడేస్తుంది. ఇలా రెప్పమాటు కాలంలో జింకపై దాడి చేసి చంపేస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: గుర్రానికి షాక్ ఇచ్చిన పొట్టేలు.. చివరికి ఏం చేసిందో చూస్తే.. అవాక్కవాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో చూస్తుంటనే గూజ్‌బమ్స్ వస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘చిరుత వేట పవర్‌కు లైవ్ ఎగ్జాంపుల్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 14.4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. బ్యాక్ టైరు లేకుండానే బైకు విన్యాసం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 10:12 AM