Viral Video: వీళ్లకు ఖచ్చితంగా పిచ్చే అనుకుంటా.. లేకపోతే మిర్చితో ఇలా ఎవరైనా ట్రై చేస్తారా..
ABN, Publish Date - May 23 , 2024 | 07:22 PM
సోషల్ మీడియాలో వంటలకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. కొందరు వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వింత వింత రెసిపీలతో సరికొత్త వంటలను చేయడం చూస్తుంటాం. ఇలాంటి
సోషల్ మీడియాలో వంటలకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. కొందరు వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వింత వింత రెసిపీలతో సరికొత్త వంటలను చేయడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర వంటలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొందరు మిర్చితో చేసిన వంట చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘వీళ్లకు నిజంగా పిచ్చే అనుకుంటా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. క్యారెట్, బాదం, బ్రెడ్ తదితర పదార్థాలతో హల్వా చేయడం సర్వసాధారణం. అయితే వీళ్లు మాత్రం ఏకంగా మిర్చితోనే హల్వా ట్రై (Halwa with chillies) చేశారు. ఇందుకోసం వారు ముందుగా మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఓ పెద్ద పాత్రలో పోసి ఉడికిస్తారు. ఇలా బాగా ఉడికించిన తర్వాత అందులో చక్కెర, పాలు, నెయ్యి, జీడిపప్పు తదితరాలను కలుపుతారు.
Viral Video: ఇదెక్కడి క్రియేటివిరా బాబోయ్..! వధూవరుల ప్రాణాల మీదకు తెచ్చిన ఎంట్రీ షాట్..
ఫైనల్‌గా ఆ మిశ్రమాన్ని మొత్తం సిద్ధంగా ఉంచుకున్న అచ్చుల్లో వేస్తారు. ఇలా చివరకు ఆ మిశ్రమం మొత్తం స్వీట్ ముక్కల్లా మారిపోతుంది. ఇది తిన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది మిర్చి హల్వ కాదు.. కేన్సర్ హల్వా’’.. అంటూ కొందరు, ‘‘మిరపకాయలను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఇదేంటీ.. చేపలు పట్టడం మరీ ఇంత ఈజీనా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Updated Date - May 23 , 2024 | 07:22 PM