Share News

Viral Video: మారిన ట్రెండ్.. బెండీ సమోసా చుశారా?

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:23 AM

సాధారణంగా సమోసా అని పేరు చెప్పగానే ఆలు సమోసా ఎక్కువగా గుర్తుకొస్తుంది. మరికొన్ని చోట్ల ఉల్లిగడ్డ, కార్న్ మిక్స్ చేసి కూడా సమోసాలను తయారు చేస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఇటివల మరో కొత్త రకం సమోసా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: మారిన ట్రెండ్.. బెండీ సమోసా చుశారా?

సాధారణంగా సమోసా అని పేరు చెప్పగానే ఆలు సమోసా(samosa) ఎక్కువగా గుర్తుకొస్తుంది. మరికొన్ని చోట్ల ఉల్లిగడ్డ, కార్న్ మిక్స్ చేసి కూడా సమోసాలను తయారు చేస్తుంటారు. ఇంకొన్ని చోట్ల విజిటెబుల్ మిక్స్ సమోసాలు కూడా తయారు చేయడం చూశాం. కానీ ఇటివల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో(viral video)లో మాత్రం కొత్తగా బెండీ సమోసా(bhindi samosa) వెలుగులోకి వచ్చింది. ఈ స్ట్రీట్ ఫుడ్‌ను ప్రస్తుతం ముంబైలో తెగ తినేస్తున్నారు. ఈ సమోసాకు గ్రీన్ చట్నీ, పచ్చి మిర్చి, కొత్తిమీర వేసి కస్టమర్లకు అందిస్తున్నారు. ఇది చూసిన జనాలు టేస్ట్ చేసి వావ్ అంటున్నారు. మరికొంత మంది మాత్రం పలు రకాలుగా అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.


ఈ వీడియోను ఇటివల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 1.1 మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. అంతేకాదు 4 వేల మందికిపైగా లైక్‌లు చేసి, షేర్స్ కూడా చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కేరళ సమోసా(kerala samosa) మోడల్ అంటున్నారు. మరికొంత మంది ఐడియా అదుర్స్ అని, క్రేజీ సమోసా అని కామెంట్లు(comments) చేశారు. ఇక ఈ కొత్త మోడల్ సమోసా ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: WPL ఫస్ట్ టైటిల్‌ గెల్చుకున్న ఆర్సీబీ.. స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ ఫోన్

Updated Date - Mar 18 , 2024 | 10:23 AM