Share News

Nisha Madhulika: యూట్యూబ్‌లో వీడియోలు చేసి అంబానీ రేంజ్‌కు.. ఈ మహిళ గురించి తెలిస్తే అవాక్కవుతారు..

ABN , Publish Date - Nov 13 , 2024 | 02:57 PM

ఓ మాజీ ఉపాధ్యాయురాలు దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ యూట్యూబర్ లలో ఒకరిగా నిలిచింది. అసలు ఆమె ఎవరు? ఏం చేస్తుంది? యూట్యూబ్ ద్వారా కోట్ల రూపాయిలు ఎలా సంపాదిస్తుందో పూర్తిగా తెలుసుకుందాం..

Nisha Madhulika: యూట్యూబ్‌లో వీడియోలు చేసి అంబానీ రేంజ్‌కు.. ఈ మహిళ గురించి తెలిస్తే అవాక్కవుతారు..
Nisha Madhulika

Nisha Madhulika: విజయం సాధించటానికి వయస్సుతో ఏ మాత్రం సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్ లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నిషా మధులికకు చిన్నప్పటి నుంచి వంటలంటే ఎంతో ఆసక్తి. ఎప్పుడు కూడా కొత్త రకాల వంటకాలు ప్రయత్నించేవారు. ప్రస్తుతం ఆమె వయస్సు 65. ఇక చేసిందేముంది.. వయసు అయిపోయింది కదా అని ఇంట్లో ఊరికే కూర్చోలేదు. తనకు నచ్చిన పనిచేస్తూ ఏకంగా కోట్లు సంపాదిస్తుంది.

యూట్యూబ్ సంచలనం..

వాస్తవానికి టీచర్ జాబ్ చేస్తున్న ఆమె 52 సంవత్సరాల వయస్సులో ఒంటరితనంతో పోరాడటానికి 2011లో ఒక ఛానెల్‌ని ప్రారంభించింది. సులువుగా అందరికీ అర్థమయ్యేలా హిందీలో వంట తయారీ వీడియోలను చేయడంతో మెుదలైన తన ప్రయాణం ఇప్పుడు నిషా దిశను మార్చేసింది. వంటల్లో ఆమె తన ప్రతిభను ప్రదర్శిస్తూ మంచి కంటెంట్ క్రియేటర్‌గా ఫేమ్ సంపాదించుకుని యూట్యూబ్ సంచలనంగా మారింది. భారతీయ వంటకాల కోసం వెతుకుతున్న చాలా మందికి నిషా పేజీని తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ప్రిపరేషన్ వీడియోల్లో నిషా మధులిక ఒకరు.

43 కోట్లు..

యూట్యూబ్‌లో అమెకు ఏకంగా 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ ఛానల్ విలువ ఇప్పుడు 43 కోట్ల రూపాయిలు. ప్రస్తుతం నోయిడాలో నివసిస్తున్న తన భర్తకు నిషా మధులిక తన ఆదాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో సహాయం చేస్తోంది. సోషల్ మీడియా సమ్మిట్ & అవార్డ్స్‌ 2017లో టాప్ యూట్యూబ్ వంట కంటెంట్ క్రియేటర్ గా ఆమె అవార్డును కూడా అందుకున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 03:33 PM