ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఈ చిలుక డిజైనింగ్ మామూలుగా లేదుగా.. నిద్రపోతున్న వ్యక్తి జుట్టును ఎలా మార్చిందంటే..

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:21 PM

జంతువులు, పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మనుషుల నుంచి వస్తువులు లాక్కునే కోతులు.. ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుని వస్తువులను వెనక్కు ఇవ్వడం చూశాం. అలాగే కుక్కలు, పిల్లులు కూడా అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి...

జంతువులు, పక్షులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మనుషుల నుంచి వస్తువులు లాక్కునే కోతులు.. ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుని వస్తువులను వెనక్కు ఇవ్వడం చూశాం. అలాగే కుక్కలు, పిల్లులు కూడా అంతా అవాక్కయ్యేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి విచిత్రకర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిలుక వీడియో తెగ వైరల్ అవుతోంది. నిద్రపోతున్న వ్యక్తి జుట్టును తన ఈకలతో అందంగా మార్చడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అందమైన చిలుకను పెంచుకున్నాడు. అయితే ఆ అందమైన చిలుకకు డిజైనింగ్ వర్క్ కూడా బాగా తెలిసినట్టుంది. ఓ రోజు తన యజమాని నిద్రపోతున్న సమయంలో చిలుక (parrot) అక్కడికి వెళ్లింది. తన యజమాని జుట్టును చూడగానే... ఏదైనా కొత్తగా డిజైన్ చేయాలని చిలుకకు అనిపించినట్లుంది. తనలోని టాలెంట్‌ను మొత్తం బయటపెట్టేసింది. ఊడిపోయిన తన ఈకలను ఒక్కొక్కటిగా తన యజమాని తలలో గుచ్చేసింది.

Viral video: మైక్రోవేవ్‌ను ఇలా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. బామ్మా... నువ్వు కేక..!


ఇలా చాలా ఈకలను ఓ క్రమపద్ధతిలో అలంకరించింది. ఫైనల్‌గా చూస్తే జుట్టుకు పెయింట్ వేసినట్లుగా అనిపించింది. చూసేందుకు ఎవరో హెయిర్‌స్టైలిస్ట్ (Hairstylist) అతడి జుట్టును అందంగా మార్చేసినట్లు అనిపిస్తుంది. ఈ అందమైన చిలుక.. తన యజమాని జుట్టును అంతే అందంగా మార్చేసిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిలుక ముందు.. హెయిర్‌స్టైలిస్ట్‌లు కూడా దిగదుడుపే’’.. అంటూ కొందరు, ‘‘ఈ చిలుక తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఇదెక్కడి ఐడియారా బాబోయ్..! బీరువా డోరు తీస్తే.. లోపల మీరెవరూ ఊహించని సీన్..

Updated Date - Jun 07 , 2024 | 09:21 PM

Advertising
Advertising