Viral Video: ఇలాంటి రైలు ప్రయాణం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వీళ్ల నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - May 28 , 2024 | 08:02 PM
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఆకతాయిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు సెల్ఫీల కోసం ప్రమాదకరంగా ప్రయాణిస్తే.. మరికొందరు ఎలాగైనా గమ్యస్థానం చేరాలనే తొందరలో రద్దీ రైళ్లలో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి..
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఆకతాయిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు సెల్ఫీల కోసం ప్రమాదకరంగా ప్రయాణిస్తే.. మరికొందరు ఎలాగైనా గమ్యస్థానం చేరాలనే తొందరలో రద్దీ రైళ్లలో ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ ఇలాంటి రైలు ప్రయాణం ‘‘నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణ సమయాల్లో సాధారణంగా ప్రయాణికులు బోగీల్లో కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేయడం కూడా చూస్తుంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కొందరు రైల్లో విచిత్రంగా ప్రయాణించారు. బోగీల్లో కాకుండా (Passengers traveling on train engine) ఏకంగా ఇంజిన్‌పై ప్రయాణించారు. అది కూడా ఇంజిన్‌కు బయట ఉన్న స్థలంలో వరుసగా కూర్చున్నారు. వాళ్లలో కొందరు కూర్చుని ఉండగా.. మరికొందరు నిలబడి ఉన్నారు.
Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ప్రేమికుల గొడవ.. చివరకు ప్రియురాలు చేసిన పనికి అంతా షాక్..
రైలు వేగంగా వెళ్తున్నా కూడా.. వారిలో ఏమాత్రం భయం కనిపించదు. మధ్య మధ్య బ్రిడ్జి వచ్చిన సందర్భాల్లోనూ వారు అలాగే తాపీగా కూర్చుని ఉంటారు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల ప్రయాణం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అసలు వీళ్లు.. ఇంజిన్‌లోకి ఎలా వచ్చారు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయాణం చాలా ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: దండ వేయగానే వధువు చేసిన పనికి వరుడు షాక్.. అనుమానంగానే ఆమె మెడలో దండ వేయగా..
Updated Date - May 28 , 2024 | 08:03 PM