ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పురి విప్పిన నెమలికి ఇంత పవర్ ఉంటుందా.. వెనుక నుంచి పులి దాడి చేస్తుందనగా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN, Publish Date - Aug 13 , 2024 | 06:26 PM

అడవుల్లో జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా పులులు, సింహాల వేట సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణంగా పులులు, సింహాల వేటకు తిరుగే ఉండదు. అయితే కొన్నిసార్లు మాత్రం..

అడవుల్లో జంతువుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా పులులు, సింహాల వేట సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణంగా పులులు, సింహాల వేటకు తిరుగే ఉండదు. అయితే కొన్నిసార్లు మాత్రం వీటికీ ఆశాభంగం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవిలో ఓ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటుంది. ఇంతలో ఓ పులి వెనుక నుంచి దాడి చేయాలని చూస్తుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొన్ని నెమళ్లు అడవిలో గడ్డి పొదల సమీపంలో సంచరిస్తుంటాయి. ఆ సమయంలో వాటిలో ఓ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటుంది. ఇలా నెమళ్లన్నీ సరదాగా గడుపుతున్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో దాని వెనుక గడ్డి పొదల్లో ఉన్న పులి నెమలిని గమనిస్తుంది.

Viral Video: బైకును కారులా మార్చేశాడుగా.. వీడియో చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే..


నెమలి ఆదమరచి నాట్యం చేస్తోందని గ్రహించిన పులి.. మెల్లగా వెనుక నుంచి నక్కి నక్కి ముందుకు వస్తుంది. సమీపానికి రాగానే ఒక్కసారిగా (tiger attacked peacock) నెమలిపై పంజా విసురుతుంది. అయితే పులి సమీపానికి రాగానే.. నెమలి అలెర్ట్ అయిపోతుంది. ఆదమరచి నాట్యం చేస్తున్న నెమలి.. చుట్టూ అన్నీ గమనిస్తుందనే విషయాన్ని పులి గమనించలేకపోయింది. పులి ఇలా పంజా విసరగానే నెమలి వెంటనే గాల్లోకి లేస్తుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న నెమళ్లు కూడా గాల్లోకి లేచి పులికి చిక్కకుండా పారిపోతాయి.

Viral Video: అవి చేతులా లేక రబ్బరు పైపులా.. ఇతడు చేస్తున్న విన్యాసం చూస్తే..


దీంతో ఆవేశంగా పంజా విసిరిన పులి.. ఇలా చివరకు నిరాశగా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ నెమలి చాలా తెలివైనదిగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పులి షాక్ ఇచ్చిన నెమలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..

Updated Date - Aug 13 , 2024 | 06:26 PM

Advertising
Advertising
<