Viral Video: దారి మధ్యలో ప్రేమ జంట.. వెనుకే నిలబడ్డ పెంగ్విన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
ABN, Publish Date - Dec 25 , 2024 | 08:03 PM
penguin Viral Video: జంతువులు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు అవి ప్రవర్తించే తీరు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంకొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే మనుషులు కూడా నేర్చుకోవాలనిపించేలా ఉంటాయి. ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..
జంతువులు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు అవి ప్రవర్తించే తీరు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఇంకొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే మనుషులు కూడా నేర్చుకోవాలనిపించేలా ఉంటాయి. ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట దారి మధ్యలో నిలబడి ఉంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ పెంగ్విన్ చివరకు ఏం చేసిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (lovers) మంచు ప్రాంతంలో సరదాగా గడుపుతుంటుంది. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో నిలబడి అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు. అయితే ఆ మార్గంలో రెండు పెంగ్విన్లు (Penguins) నడుస్తూ వస్తుంటాయి. వాటిలో నల్లటి పెంగ్విన్ అటుగా వెళ్తూ ప్రేమికుల వెనుక వైపు ఆగిపోతుంది. తన దారికి వారు అడ్డుగా ఉండడంతో అక్కడే నిలబడి వేచి చూస్తుంటుంది.
ఈ క్రమంలో ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ.. కొంచెం పక్కకు తప్పుకొంటే.. నేను వెళ్లిపోతా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. కాసేపటికి తమ వెనుక ఉన్న పెంగ్విన్‌ను ఆ ప్రేమ జంట గమనిస్తుంది. దాని క్రమశిక్షణకు వారు ఎంతో ముచ్చటపడిపోతారు. పెంగ్విన్ మర్యాద చూసి మురిసిపోయిన వారు.. తర్వాత దానికి దారి ఇచ్చి వెళ్లమని వీడ్కోలు పలుకుతారు. వారు పక్కకు జరిగిన తర్వాత ఎంతో పద్ధతిగా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోతుంది.
అలాగే ఎదురుగా వస్తున్న తెల్ల పెంగ్విన్ కూడా అంతే పద్ధతిగా రావడాన్ని వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెంగ్విన్ మర్యాద మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పెంగ్విన్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం కోటికి పైగా లైక్‌లు, 14.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 25 , 2024 | 08:03 PM