ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గుండెల్ని పిండేసే వీడియో.. గ్రామంలోకి చొరబడ్డ ఏనుగులు.. గ్రామస్తులు నిప్పు పెట్టడంతో చివరకు..

ABN, Publish Date - Aug 29 , 2024 | 04:28 PM

అటవీ సమీప ప్రాంతాల్లోకి తరచూ అడవి జంతువులు చొరబడడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో జనం భయంతో పరుగులు పెడుతుంటారు. కొన్నిసార్లు వాటిని తరిమికొట్టేందుకు ప్రజలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాటి ప్రాణాలు తీయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

అటవీ సమీప ప్రాంతాల్లోకి తరచూ అడవి జంతువులు చొరబడడం సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో జనం భయంతో పరుగులు పెడుతుంటారు. కొన్నిసార్లు వాటిని తరిమికొట్టేందుకు ప్రజలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వాటి ప్రాణాలు తీయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గ్రామంలోకి చొరబడ్డ ఏనుగులను తరిమేందుకు గ్రామస్తులు నిప్పు పెట్టారు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) జార్‌గ్రామ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అటవీ ప్రాంత సమీపంలో ఇటీవల ఓ రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఏనుగులు (Elephants) అడవి నుంచి సమీప గ్రామంలోకి చొరబడ్డాయి. దీంతో జనం భయంతో పరుగులు పెట్టారు. కొందరు ఏనుగులను తరిమికొట్టేందుకు ఇనుప రాడ్లతో వెంటపడతారు.

Mahabubabad: భర్తకు దివ్యాంగురాలితో రెండో పెళ్లి చేసిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే..


అయితే ఈ క్రమంలో వారిలో మరికొందరు పదునైన ఇనుప కడ్డీలకు (villagers set fire to the elephant) మంట పెట్టి ఏనుగులపై విసిరారు. దీంతో ఆ ఇనుప రాడ్డు ఓ పెద్ద ఏనుగుకు గుచ్చుకుంది. మంట దాటికి ఆ ఏనుగు విలవిల్లాడిపోయింది. మిగతా ఏనుగులన్నీ అక్కడి నుంచి పారిపోగా.. ఆ ఏనుగు మాత్రం నొప్పితో అటూ, ఇటూ మెలికలు తిరుగుతూ చివరకు ఓ చోట కుప్పకూలిపోయింది. చూస్తుంటే ఈ ఘటనలో ఆ ఏనుగు తీవ్ర గాయాలైనట్లు కనిపిస్తోంది. ఈ ఘటనను అటవీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అడవి జంతువులను తరిమేందుకు డ్రమ్ములు వాయించడం వంటికి చేయాలని, ఇలా ఫైర్ బాల్స్ ప్రయోగించడం నేరమని చెప్పారు.

Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. చివరకు స్కానింగ్ తీయగా పేగుల్లో షాకింగ్ సీన్..


ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఈ ఏనుగును చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా జంతువులను హింసించడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 29 , 2024 | 04:28 PM

Advertising
Advertising