ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రోడ్డు మధ్యలో మహిళ వింత నిర్వాకం.. తాంత్రిక పూజలు చేస్తూ.. అంతా చూస్తుండగానే..

ABN, Publish Date - Jul 27 , 2024 | 05:03 PM

కొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఇటీవల ఏకంగా మహిళలు కూడా నడి రోడ్లపై దుస్తులు విప్పుకొని మరీ హల్‌చల్ చేయడం చూస్తున్నాం. కొంతమంది యువతులు...

కొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తుంటారు. ఇటీవల ఏకంగా మహిళలు కూడా నడి రోడ్లపై దుస్తులు విప్పుకొని మరీ హల్‌చల్ చేయడం చూస్తున్నాం. కొంతమంది యువతులు రోడ్డుపైనే మందు కొడుతూ అసభ్యకరంగా ప్రవర్తించడం కూడా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోడ్డు మధ్యలో ఓ మహిళ తాంత్రిక పూజలు చేయడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్‌పూర్‌లోని బీచ్ రోడ్డులో ఈ ఘటన చోట చేసుకుంది. ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ మహిళ ఉన్నట్టుండి సూర్యాస్తమయ సమయంలో బీచ్ రోడ్డుపైకి వచ్చింది. ఉన్నట్టుండి రోడ్డు మధ్యలోకి కూర్చుని వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి పూజా సామాగ్రిని బయటికి తీసింది. తర్వాత అక్కడే మంట వెలిగించి, అందులో ఏవోవే చల్లుతూ మంత్రాలు చదివింది.

Viral Video: కాలువలో కొట్టుకుపోతున్న స్నేహితుడిని.. చివరకు చిన్న ట్రిక్‌తో రెప్పపాటులో ఇలా..


అంతటితో ఆగని ఆమె.. కాసేపటి తర్వాత మంట చుట్టూ (woman performing worship on the road) తిరుగుతూ చప్పట్లు కొడుతూ అరుస్తోంది. ఆ తర్వాత దెయ్యం పట్టిన వారిలా మంట వద్ద వెంట్రుకలు విరబోసుకుని కూర్చుని ఊగుతోంది. ఇలా ఆమె రోడ్డు మధ్యలోనే చాలా సేపు అలాగే చేస్తోంది. ఈ ఘటనను చూసిన వారంతా షాక్ అయ్యారు. వాహనదారులు ఆమెకు దూరంగా వెళ్లారు. కొంతమంది అయితే అటుగా వెళ్లకుండా తమ రూట్ మార్చుకుని వేరే మార్గం గుండా వెళ్లడం కనిపిచింది.

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..


అయితే ఆమె రోడ్డుపై చాలా సేపు హంగామా చేస్తున్నా.. ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదు. ‘‘మనకెందుకొచ్చిన గొడవ’’.. అని అనుకుంటూ కార్లు, బైకులన్నీ ఆమెకు సమీపానికి రాకుండా దూరం నుంచే వెళ్లాయి. కాగా, ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెవరో విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈమె మానసిక పరిస్థితి సరిగా లేనట్టుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఎవరికో చేతబడి చేస్తున్నట్లు ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 27 , 2024 | 05:03 PM

Advertising
Advertising
<