Viral Video: రైల్లో ఏసీ పని చేయలేదని చైన్ లాగాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..
ABN, Publish Date - Oct 30 , 2024 | 09:07 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడికి పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైల్లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ రైలు ఏసీ కోచ్‌లో సదరు యువకుడు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ప్రయాణ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా తన సీట్లో పడుకోగానే ఏసీ పని చేయలేదు. దీంతో..
రైలు ప్రయాణ సమయాల్లో చాలా మందికి చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు సీట్ల కోసం కుస్తీలు పడుతూ నెటిజన్ల దృష్టిలో పడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తికి ఎదురైన షాకింగ్ అనుభవానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్లో ఏసీ పని చేయలేదనే కోపంతో చైన్ లాగేశాడు. అయితే చివరకు చోటు చేసుకున్న ఘటన చూసి షాక్ అయ్యాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడికి పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైల్లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ రైలు ఏసీ కోచ్‌లో సదరు యువకుడు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ప్రయాణ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా తన సీట్లో పడుకోగానే ఏసీ పని చేయలేదు. దీంతో అతడికి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. ఎంతసేపు చూసినా ఏసీ ఆన్ కాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
ఈ క్రమంలో అక్కడున్న చైన్ లాగేసి (man pulled the train chain) తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు ఆగిన నిముషాల వ్యవధిలో పోలీసులు (Railway Police) అక్కడికి చేరుకున్నారు. చైన్ లాగిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను వారితో కూడా వాగ్వాదానికి దిగాడు. ఏసీ పని చేయలేదని, అందుకే చైన్ లాగానని గొడవపడ్డాడు.
ఏసీ పని చేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ.. ఇలా చైన్ లాగడం నేరం.. అంటూ పోలీసులు అతన్ని బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏసీ పనిచేయకపోతే ఫిర్యాదు చేయాలి గానీ.. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం తప్పు’’.. అంటూ కొందరు, ‘‘పోలీసులు చేసింది కరెక్ట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మిస్టర్ మేధావి అంటే ఇతనే.. బాస్కెట్ బాల్‌కు ఎలా గాలి నింపుతున్నాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..
Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..
Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 30 , 2024 | 09:08 PM