ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: చలనం లేకుండా పడి ఉన్న కోతిని.. ఈ పోలీసు క్షణాల్లో ఎలా రక్షించాడో చూడండి..

ABN, Publish Date - May 30 , 2024 | 04:38 PM

ప్రాణాపాయంలో ఉన్న వారిని కొందరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూస్తుంటాం. మరికొందరు జంతువుల పట్ల కూడా మానవత్వం కనబరుస్తుంటారు. ఇంకొందరు ఆకలితో ఉన్న జంతువులకు రోజూ ఆహారం, నీళ్లు అందించడం చూస్తుంటాం. ఇలాంటి...

ప్రాణాపాయంలో ఉన్న వారిని కొందరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూస్తుంటాం. మరికొందరు జంతువుల పట్ల కూడా మానవత్వం కనబరుస్తుంటారు. ఇంకొందరు ఆకలితో ఉన్న జంతువులకు రోజూ ఆహారం, నీళ్లు అందించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పోలీసు కోతి పట్ల మానవత్వం ప్రదర్శించిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చలనం లేకుండా పడి ఉన్న కోతిని.. ఈ పోలీసు ఎలా కాపాడాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బులంద్‌షహర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటీవల ఓ రోజు ఓ కోతి ఎండ వేడి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. స్టేషన్ ఆవరణలో చలనం లేకుండా పడి ఉన్న కోతిని (monkey) చూసిన ఓ పోలీసు చలించిపోయాడు. అంతటితో ఆగకుండా పరుగు పరుగున కోతి వద్దకు వెళ్లి, దాన్ని నీడలోకి తీసుకొచ్చాడు. అనంతరం కోతిని పడుకోబెట్టి వీపై, ఛాతిపై గట్టిగా ప్రెస్ చేస్తూ (CPR) సీపీఆర్ చేశాడు.

Viral Video: రోడ్డుపై చిన్నపిల్లల్లా ఆడుకుంటున్న మొసలి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఇలా చాలా సేపు కోతి ఛాతిపై ప్రెస్ చేసిన తర్వాత నీళ్లు తాపించాడు. ఈ విధంగా అతను చాలా సేపు చేసేసరికి కోతి స్పృహలోకి వచ్చింది. చివరగా కోతి తలపై నీళ్లు పోసి కోతిని అటూ ఇటూ నడిపిస్తూ ఆడించాడు. కోతి కూడా ఫైనల్‌గా ఎంతో హుషారుగా కనిపించింది. కోతి ప్రాణాలు కాపాడిన పోలీసును స్థానికులందరూ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పోలీసు ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పోలీసులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 49 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దుస్తులు వేసుకుంటుండగా బాలికకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రిలో వైద్యులు స్కానింగ్ చేసి చూడగా..

Updated Date - May 30 , 2024 | 04:38 PM

Advertising
Advertising