ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మిగిలిపోయిన చపాతీలతో ఇలాక్కూడా చేయొచ్చా.. ఇతడి తెలివికి హ్యాట్సాప్..

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:32 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన వంటింట్లో వింత ప్రయోగం చేశాడు. రాత్రి మిగిలిపోయిన చపాతీలతో వినూత్న వంటకం చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ముందుగా చపాతీలను తీసుకుని..

వివిధ రకాల ఆహార పదార్థాలతో వింత వింత వంటలు చేసేవారిని రోజూ చూస్తుంటాం. కొందరు పానీపూరీలో న్యూడిల్స్ వేస్తే.. మరికొందరు ఎర్రచీమలతో చట్నీ చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర రెసిపీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మిగిలిపోయిన చపాతీలతో అతను చేసిన ప్రయోగం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘మిగిలిపోయిన చపాతీలతో ఇలాక్కూడా చేయొచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన వంటింట్లో వింత ప్రయోగం చేశాడు. రాత్రి మిగిలిపోయిన చపాతీలను స్వీట్‌గా మార్చాలని అనుకున్న అతను.. అందుకు తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ముందుగా చపాతీలను తీసుకుని నూనెలో బాగా వేయించాడు. ఆ తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా విరిచాడు. ఆ ముక్కలన్నింటినీ మిక్సీలో వేసి పౌడర్‌గా మార్చాడు.

Viral Video: విమానం ఎక్కబోతూ ఇదేం పని.. ఎయిర్‌హోస్టెస్‌ ఎదుటే ఇతడు చేసిన ఘనకార్యం చూస్తే..


చపాతీల పౌడర్‌ను పక్కన పెట్టుకుని, స్టవ్‌పై పాన్‌ పెట్టి అందులో చక్కెర పోసి పాకం వచ్చే దాకా వేడి చేశాడు. తర్వాత అందులో పాలు పోసి బాగా మిక్స్ చేశాడు. ఆపై అందులో పక్కన సిద్ధంగా ఉంచుకున్న చపాతీ పౌడర్‌ను పోసి బాగా కలిపేశాడు. ఫైనల్‌గా తయారైన మిశ్రమాన్ని ఓ ప్లేట్‌లోకి తీసుకుని, పీస్‌లుగా కట్ చేసేశాడు. ఇలా ఫైనల్‌గా మిగిలిపోయిన చపాతీలతో మిల్క్ కేకులను (Preparation milk cakes with left over chapatis ) సులభంగా తయారు చేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: బాత్రూంలో దాక్కున్న అత్యంత విషపూరిత పాము.. చివరకు అది చేసిన పని చూసి ఖంగుతిన్న స్నేక్ క్యాచర్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. మిగిలిపోయిన చపాతీలతో ఇలాక్కూడా చేయొచ్చన్నమాట’’.., ‘‘నేనైతే చపాతీని టీలో ముంచుకుని తింటాను’’.., ‘‘చపాతీలో పంచదార వేసి, పాలతో కలిపి తింటే ఇంకా బాగుంటుంది’’.., ‘‘మా హాస్టళ్లలో మిగిలిపోయిన చపాతీను ఇలాగే చేస్తారు’’.., ‘‘కేకుగా మారిన చపతీ.. సూపర్’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీగియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి మరి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 05:32 PM

Advertising
Advertising
<