ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం పాడుపని.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు..

ABN, Publish Date - Jul 10 , 2024 | 09:20 PM

‘‘గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః.. గురు సాక్షాత్ పరబ్రహ్మ’’ .. ప్రతి మనిషి జీవితంలో గురువుకు అంతటి స్థానం ఉంటుంది కాబట్టే దైవంగా భావిస్తుంటారు. అయితే రాను రాను కొందరి వల్ల...

‘‘గురు బ్రహ్మ, గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః.. గురు సాక్షాత్ పరబ్రహ్మ’’ .. ప్రతి మనిషి జీవితంలో గురువుకు అంతటి స్థానం ఉంటుంది కాబట్టే దైవంగా భావిస్తుంటారు. అయితే రాను రాను కొందరి వల్ల గురువుల స్థానానికి అర్థాలు మారిపోతున్నాయి. వయసు వరుస మరచి ప్రవర్తించేవారు కొందరైతే.. మరికొందరు తోటి టీచర్ల పట్ల విద్యాలయాల్లోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరితో ఛీకొట్టించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గదిలోకి వెళ్లిన టీచర్‌తో హెచ్ఎం పాడుపని చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) జాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పాఠశాల హెచ్ఎం ప్రవర్తించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మహిళా టీచర్‌ను తన గదిలోకి పిలిచిన హెచ్ఎం.. చివరకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్‌ను (principal hugging the female teacher) దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. చదువు చెప్పే పాఠశాల అనే విషయం కూడా మర్చిపోయి ఆమెతో సరసాలు ఆడుతున్నాడు. మధ్యలో అతడికి ఫోన్ రావడంతో ఆమెను వదిలేసి ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: అంతా నిద్రపోయాక ఫ్రిడ్జి వద్దకు వెళ్లిన చిన్నారి.. డోరు తీసి మరీ ఆమె చేసిన నిర్వాకం చూస్తే..


ఎవరో ముందుగానే ఆ గదిలో ఫోన్ ఉంచి, వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్లు మండిపడుతున్నారు. స్కూల్ అనే విషయం మర్చిపోయి.. గదిలో ఎందరో మహనీయుల ఫొటోల సమక్షంలో ఇలాంటి తప్పులు పనులు చేసిన ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో వైరల్ అవడంతో జౌన్‌పూర్‌లోనే కాకుండా మొత్తం యూపీ విద్యాశాఖలో కలకలం రేగుతోంది. దీనిపై విద్యాశాఖాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Viral Video: దుస్తులు మార్చుకునే గదిలో యువతికి వింత సమస్య.. రీల్ చేసే క్రమంలో డోర్ లేకపోవడంతో..

Updated Date - Jul 10 , 2024 | 09:20 PM

Advertising
Advertising
<