Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..

ABN, Publish Date - Aug 09 , 2024 | 11:05 AM

ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానంగా చూస్తుంటాం. అలాగే వారు కూడా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటిమాట. ప్రస్తుతం ...

Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..

ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానంగా చూస్తుంటాం. అలాగే వారు కూడా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటిమాట. ప్రస్తుతం ఉపాధ్యాయుడి స్థానానికి కొందరి వల్ల చెడ్డపేరు వస్తోంది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు మహిళా టీచర్లను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేయడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హాజరు వేస్తానంటూ మహిళా టీచర్‌ను గదిలోకి పిలిచిన ఉపాధ్యాయుడు.. చివరకు వింత కండీషన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రస్తుతం ఆన్‌లైన్ హాజరు విధానం నడుస్తోంది. ఈ విధానం వల్ల కొంతవరకూ ప్రయోజనం ఉన్నా.. మహిళా ఉద్యోగులు మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తో్ంది. ప్రధానంగా హాజరు విషయంలో వారి పైవారి నుంచి లైకింగ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Viral Video: ఇదెక్కడి ప్రాంక్‌రా బాబోయ్.. చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం..


ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కోడుతోంది. హాజరు వేస్తానంటూ ఓ ఉపాధ్యాయుడు.. మహిళా టీచర్‌ను (principal misbehaved with the female teacher) తన గదిలోకి పిలిచాడు. అతడి వద్దకు వెళ్లగానే.. హాజరు వేసేందుకు గానూ చివరకు ఓ కండీషన్ పెట్టాడు. ‘‘నీ హాజరు మొత్తం వేసేస్తా.. అందుకు బదులుగా నేను అడిగింది ఇవ్వాలి.. అది ఇవ్వడం నీకు పెద్ద కష్టం కూడా కాదు’’.. అన్నాడు. అతడి మాటలకు అవాక్కైన మహిళా టీచర్.. ‘‘ఏం చేయాలి’’.. అని అడుగుతుంది.

Viral Video: తాగుడుకు బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..


అందుకు అతను.. తన చెంపపై వేలు చూపిస్తూ.. అక్కడ ముద్దు పెట్టాలని కోరతాడు. దీంతో షాక్ అయిన టీచర్ ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం ఉండదంటూ తిరస్కరిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా తన ఫోన్‌లో ఇదంతా రికార్డ్ చేస్తుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ముద్దు కాదు.. చెంప చెల్లుమనిపించి ఉంటే బాగుండు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత స్నేహమైతే మాత్రం మరీ ఇదేంటీ.. రెండు రైళ్ల మధ్య వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Aug 09 , 2024 | 11:05 AM

Advertising
Advertising
<