Viral Video: ఇతడి టాలెంట్‌కి ఫిదా అయిన ప్రొఫెసర్.. ఇలా సర్ప్రైజ్ చేయాలని.. ఎలా అనిపించిందయ్యా..!
ABN, Publish Date - Mar 01 , 2024 | 03:24 PM
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ఉంటుంది. అయితే సందర్భానుసారం అది బయటపడుతుంటుంది. అలాంటప్పుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజగా..
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ఉంటుంది. అయితే సందర్భానుసారం అది బయటపడుతుంటుంది. అలాంటప్పుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి టాలెంట్‌కి ప్రొఫెసర్ ఫిదా అయ్యాడు. ఇంతకీ అతను ప్రొఫెసర్ని ఎలా సర్ప్రైజ్ చేశాడంటే..
జార్ఖండ్ (Jharkhand) రాంచీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఓ విద్యార్థి తన ప్రొఫెసర్‌కి ఎవరూ ఊహించిని, వినూత్నమైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తనలోని టాలెంట్‌ని బయటపెట్టాడు. పేపర్‌పై తన ప్రొఫెసర్ చిత్రాన్ని పెన్సిల్‌తో (Pencil art) గీశాడు. అది కూడా ఏదీ గీశామంటే గీశామని కాకుండా అచ్చుగుద్దినట్లు ప్రొఫెసర్ మొఖాన్ని దింపేశాడు. ఫైనల్‌గా చూడగా ఆశ్చర్యం కలిగించేలా.. చేత్తో గీసినట్లు ఎక్కడా అనిపించకుండా ఎంతో చక్కగా డ్రాయింగ్ వేశాడు. చివరగా ఆ పేపర్‌ను తన ప్రొఫెసర్‌కు అందించాడు.
పేపర్‌పై విద్యార్థి గీసిన ఆర్ట్ చూడగానే.. ‘‘ఎక్కడ ప్రింట్ చేయించావ్.. చాలా బాగుంది’’.. అని అంటాడు. అయితే ఇందుకు బదులుగా విద్యార్థి.. ‘‘నేనే స్వయంగా గీశా సార్’’.. అని బదులిస్తాడు. దీంతో ప్రొఫెసర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ‘‘ఏంటీ నువ్వు గీశావా.. వావ్..! సూపర్.. ఎంతో బాగుంది’’.. అంటూ విద్యార్థిని ప్రశంసిస్తాడు. ‘‘నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు.. నువ్వు జీవితంలో పైకి వస్తావ్’’.. అంటూ ఆశీర్వదిస్తాడు. కాగా, ఈ వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఆర్ట్.. అద్భుతంగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇతడికి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Mar 01 , 2024 | 03:25 PM