మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కుందేలు చేష్టలకు నివ్వెరపోయిన వాహనదారులు.. దారి మధ్యలో అది చేసిన పనేంటంటే..

ABN, Publish Date - May 31 , 2024 | 08:17 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కుందేలు సాధారణంగా ఎలాంటి జంతువులపై కూడా దాడికి దిగదు. అలాంటిది కుందేలు పాములకు ఇంకా దూరంగా ఉంటుంది. కానీ..

Viral Video: కుందేలు చేష్టలకు నివ్వెరపోయిన వాహనదారులు.. దారి మధ్యలో అది చేసిన పనేంటంటే..

సోషల్ మీడియలో జంతువులు, పక్షులు తదితర జీవులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తమ జోలికి వస్తే ఎలాంటి జంతువులపై అయినా పాములు దాడికి దిగుతుంటాయి. అయితే ఈక్రమంలో కొన్నిసార్లు చిన్న చిన్న జంతువుల చేతిలో కూడా ఓడిపోతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా కుందేలు, పాముకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నడి రోడ్డుపై అది చేసిన నిర్వాకం చూసి వాహనదారులు షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కుందేలు సాధారణంగా ఎలాంటి జంతువులపై కూడా దాడికి దిగదు. అలాంటిది కుందేలు పాములకు ఇంకా దూరంగా ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఓ పిల్ల కుందేలు పాముపై పగబట్టింది. దాన్ని తరుమకుంటూ రోడ్డు పైకి వచ్చింది. పామును పదే పదే కొరుకుతూ (rabbit attacked snake) చంపేయడానికి ప్రయత్నించింది. కుందేలు ఇలా ప్రవర్తించడాన్ని చూసి వాహనదారులు షాక్ అయ్యారు. ‘‘ఇదేంటీ.. పాముపై కుందేలు దాడి చేస్తోంది’’.. అంటూ ఆసక్తిగా చర్చించుకున్నారు.

Viral Video: ఇదెక్కడి తెలివిరా బాబోయ్.. కూలర్‌ను ఫ్రిడ్జ్‌గా ఎలా మార్చాడో చూడండి..


కుందేలు చాలా సేపు నడి రోడ్డుపైనే పాముపై దాడికి దిగింది. మరోవైపు కుందేలు నుంచి తప్పించుకోవడానికి పాము రోడ్డు పక్కన ఉన్న గడ్డిలోకి పారిపోయింది. అయినా కుందేలు మాత్రం పామును వదలకుండా వెంటాడింది. ఈ ఘటనను మొత్తం కారులో ఉన్న వారు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కుందేలు కాదు పులి’’.. అంటూ కొందరు, ‘‘పాముకు చుక్కలు చూపించిన కుందేలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎగ్జిబిషన్‌ను కూడా వదల్లేదు.. జాయింట్ వీల్‌‌లో ప్రేమికుల నిర్వాకం చూస్తే..

Updated Date - May 31 , 2024 | 08:17 PM

Advertising
Advertising