ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Success Story: స్కూల్, కాలేజీలో ఫెయిల్.. కట్ చేస్తే ఐఏఎస్.. వాట్ ఎ సక్సెస్ స్టోరీ..

ABN, Publish Date - Dec 20 , 2024 | 05:58 PM

సివిల్స్‌లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి. టాపర్ అయ్యుండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలా ఎన్నెన్నో అనుకుంటారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారైతే యూపీఎస్సీ గురించి ఆలోచించేందుకే భయపడతారు. కానీ, పట్టుదల ముందు ఇలాంటి కొలమానాలన్నీ తక్కువే అని రుజువు చేశాడు బీహార్‌కు చెందిన అనురాగ్ కుమార్. స్కూల్లో, ఇంటర్లో ఫెయిలైన ఆ యువకుడు.. తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించాడు. అంతేనా.. వరసగా రెండుసార్లు సక్సెస్‌ఫుల్‍‌గా క్లియర్ చేశాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..

Success Story

సివిల్స్‌లో ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి. టాపర్ అయ్యుండాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇలా ఎన్నెన్నో అనుకుంటారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారైతే యూపీఎస్సీ గురించి ఆలోచించేందుకే భయపడతారు. కానీ, పట్టుదల ముందు ఇలాంటి కొలమానాలన్నీ తక్కువే అని రుజువు చేశాడు బీహార్‌కు చెందిన అనురాగ్ కుమార్. హిందీ మీడియంలో చదివి స్కూల్లో, ఇంటర్లో ఫెయిలైన ఆ యువకుడు.. తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించాడు. అంతేనా.. వరసగా రెండుసార్లు సక్సెస్‌ఫుల్‍‌గా క్లియర్ చేశాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా..


బీహార్‌లోని కతిహార్ జిల్లాకు చెందిన అనురాగ్ ఎనిమిదో తరగతి వరకు హిందీ మీడియంలోనే చదివాడు. తర్వాత చాలామందిలాగే ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియంకి మారిపోయాడు. దీంతో చదువు ఒక పట్టాన బుర్రకు ఎక్కేదే కాదు. ఎంత కష్టపడినా తొలి ఏడాదిప్రీ-బోర్డ్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత బోర్డు పరీక్షల్లోనూ తక్కువ మార్కులే వచ్చాయి. చివరకు ఎలాగో అత్తెసరు మార్కులతో 12వ తరగతి గట్టెక్కాడు. అనంతరం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరాడు.


ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనామిక్స్‌లో అడ్మిషన్ తీసుకున్న అనురాగ్‌ ఇంటికి దూరంగా ఉండలేకపోయాడు. దీంతో చదువుపై దృష్టిపెట్టలేక గ్రాడ్యుయేషన్‌లో చాలా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఒకరోజున స్కూలు నుంచి డిగ్రీ వరకూ ప్రతిచోటా వైఫల్యాలు ఎదురవడం కారణమేంటని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఇలాంటి ఆలోచనతోనే చదువు కొనసాగిస్తే భవిష్యత్తు చేజేతులా పాడుచేసుకున్నట్టు అవుతుందని చదువుపై దృష్టిసారించాలనే నిర్ణయానికొచ్చాడు. తదేక దీక్షతో చదివి 2014లో ఎస్‌ఆర్‌సిసిలో గ్రాడ్యుయేషన్, 2016లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.


పీజీ చేసే సమయంలో స్నేహితుల స్ఫూర్తితో సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు అనురాగ్. స్కూలు నుంచి డిగ్రీ వరకూ ప్రతి చోటా ఫెయిలైన నీకెందుకు యూపీఎస్సీ అని విమర్శలు వచ్చినా లక్ష్యపెట్టలేదు. ముందడుగు వేసి జీవితాన్ని కొత్తగా మలుచుకోవాలనుకున్నాడు. మునుపటి వైఫల్యాలు విస్మరించి పట్టుదలతో చదివి 2017లో తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించాడు.


మొదటిసారే యూపీఎస్సీ సాధించినా, ర్యాంక్ 677 రావడంతో సంతృప్తి చెందలేదు అనురాగ్. 2018లో మరోసారి సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఈ సారి ఆలిండియా స్థాయిలో 48వ ర్యాంక్ దక్కించుకుని ఐఏఎస్ అయ్యాడు. అందుకే గతంలో వైఫల్యాలు వెక్కిరించాయని వెనకడుగు వేయకూడదని అంటాడు అనురాగ్. గతంలో ఎలా ఉన్నాం అనేదాని కంటే కోరుకున్న లక్ష్యం చేరేందుకు ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెడితే అసాధ్యమని భావించిన లక్ష్యాలనైనా సులువుగా చేరుకోవచ్చని చెబుతాడు.

Updated Date - Dec 20 , 2024 | 06:12 PM