మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

ABN, Publish Date - May 21 , 2024 | 08:02 PM

రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికులకు వివిధ రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరికి సీట్ల విషయంలో సమస్యలు ఎదురైతే.. మరికొందరికి ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంకొందరు...

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికులకు వివిధ రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరికి సీట్ల విషయంలో సమస్యలు ఎదురైతే.. మరికొందరికి ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంకొందరు తోటి ప్రయాణికుల కారణంగా అవస్థలు పడడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో దంపతలుకు విచిత్ర అనుభవం ఎదరైతంది. ఉదయాన్నే లేచిన దంపతులు.. సీట్ల కింద లగేజీ పరిశీలించగా షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కోల్‌కతా- ముంబై (Kolkata - Mumbai) జనేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైల్లో మే 19న ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో ఓ జంట ప్రయాణిస్తోంది. రాత్రి అందరిలాగానే వీళ్లు కూడా తమ లగేజీ సీట్ల కింద పెట్టుకుని పడుకున్నారు. అయితే ఉదయం లేచిన దంపతులు.. తమ లగేజీ బయటికి తీయాలని చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. సూట్‪‌కేసుల ముందు, వెనుక భాగంలో చాలా వరకు ఎలుకలు కొరికేయడం చూసి ఖంగుతిన్నారు. దీంతో షాకైన వ్యక్తి మొత్తం ఘటనను వీడియో తీశాడు. తమ సమస్యను వివరిస్తూ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ రైల్వే అధికారులకు ట్యాగ్ చేశాడు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని గుర్తించడం మీ వల్ల అవుతుందా..


అయితే ఈ వీడియోపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని తెలిపారు. ఫోన్ నంబర్ తెలియజేయాలని, వీలైనంత త్వరగా బాధితులు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏసీ కోచ్‌లోకి కూడా ఎలుకలు రావడం ఏంటో’’.. అంటూ కొందరు, ‘‘రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం’’.. అంటూ మరికొందరు, ‘‘బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఈ పావురం దౌర్జన్యం మామూలుగా లేదుగా.. ఆకలి తీర్చుకోవడానికి అది చేసిన నిర్వాకం..

Updated Date - May 21 , 2024 | 08:02 PM

Advertising
Advertising