Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

ABN, Publish Date - Aug 08 , 2024 | 08:19 AM

ఇంట్లోని గోడలు, పైకప్పుల నుంచి అప్పుడప్పుడు వింత వింత వస్తువులు, జీవులు బయటికి వచ్చిన సందర్భాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఇంటి గోడల్లో తేనెటీగలు కనిపిస్తే.. మరికొన్నిసార్లు సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు బయటికి వస్తుంటాయి. చివరకు...

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

ఇంట్లోని గోడలు, పైకప్పుల నుంచి అప్పుడప్పుడు వింత వింత వస్తువులు, జీవులు బయటికి వచ్చిన సందర్భాలను చూస్తుంటాం. కొన్నిసార్లు ఇంటి గోడల్లో తేనెటీగలు కనిపిస్తే.. మరికొన్నిసార్లు సీలింగ్ నుంచి పాములు, కొండచిలువలు బయటికి వస్తుంటాయి. చివరకు నేలను తవ్వగా మొసళ్లు కూడా బయటపడిన సందర్భాలను చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంటి పైకప్పు నుంచి గతంలో ఎన్నడూ వినని శబ్ధాలు వస్తుండడంతో అందరికీ అనుమానం కలిగింది. కొందరు పాములేమైనా ఉన్నాయేమో అని అనుకున్నారు. చివరకు చివరకు పగులగొట్టి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇండోనేషియాలో (Indonesia) చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఇటీవల ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోని వంట గది (Kitchen room) పైకప్పు నుంచి గతంలో ఎప్పుడూ వినని శబ్ధాలు వస్తున్నాయి. దీంతో ఇంట్లోని వారంతా మొదట ఏవైనా పిల్లులు, కుక్కలు శబ్ధాలు చేస్తున్నాయేమో అనుకున్నారు. కానీ ఎంతకీ శబ్ధాలు ఆగకపోవడంతో పాములేమైనా ఉన్నాయా అని కంగారు పడ్డారు.

Viral Video: చనిపోయిన నీటి గుర్రాన్ని తింటున్న హైనాలు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహాలు.. చివరకు..


ఇంట్లో రాత్రి మొత్తం ఇలాగే శబ్ధాలు వస్తుండడంతో చివరకు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది శబ్ధాలు వస్తున్న ప్రాంతంలో పరిశీలించారు. చివరకు సీలింగ్‌ను బద్ధలుకొట్టి చూడగా.. పైనుంచి (monitor lizard on the house ceiling) ఓ పెద్ద మానిటర్ బల్లి కనిపించింది. దాన్ని చూడగానే రెస్క్యూ టీంతో పాటూ ఆ ఇంట్లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత దాని తోక పట్టుకుని లాగారు. అయితే మొదట ఎంత లాగినా అది గట్టిగా పట్టుకోవడంతో కిందకు రాలేదు.

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..


చివరకు వారు ఎలాగోలా మానిటర్ బల్లిని కిందకు లాగేశారు. తర్వాత దాన్ని సురక్షితం ప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంటి పైకప్పులో మానిటర్ బల్లి.. విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘రెస్య్కూటీం సభ్యులు చాలా కష్టపడ్డారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారలు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..

Updated Date - Aug 08 , 2024 | 08:37 AM

Advertising
Advertising
<