ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. అంతా వేడుక చూస్తుండగా.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:06 PM

సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడంటే.. వేడుక చూడడం తప్ప కనీసం కాపాడే ప్రయత్నం ఎవరూ చేయని రోజులివి. పైగా కళ్ల ముందు జరిగే ఇలాంటి ఘటనలను ఫోన్లలో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ..

సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడంటే.. వేడుక చూడడం తప్ప కనీసం కాపాడే ప్రయత్నం ఎవరూ చేయని రోజులివి. పైగా కళ్ల ముందు జరిగే ఇలాంటి ఘటనలను ఫోన్లలో వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఇలాంటి సమాజంలోనూ ఇంకా మంచితనం మిగిలి ఉందని కొందరు నిరూపిస్తుంటారు. సమయానికి దేవుడిలా వచ్చి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతుంటే.. అంతా ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ వేడుక చూస్తు్న్నారు. ఈ సమయంలో అనుకోకుండా ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ హిండన్ నది వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి.. స్థానిక హిండన్ నది వద్దకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు (young man fell into the river) నదిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నాడు. అతను నీటిలో కొట్టుకుపోవడాన్ని చూసిన స్థానికులు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు.

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..


అయితే అంతా వేడక చూస్తున్నారేగానే.. ఎవరూ నీటిలోకి దూకి అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా కొందరు ఈ ఘటనను వీడియోలు తీసుకుంటున్నారు. మరోవైపు సదరు యువకుడు నీటిలో కొట్టుకుపోతున్నాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి షర్ట్ విప్పేసి నీటిలోకి దూకేశాడు. చూస్తుండగానే నీటిలో పడిపోయిన (retired Navy officer saved the youth) యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు.

Viral Video: సర్కస్‌లో షాకింగ్ సీన్.. విన్యాసాలు చేస్తుండగా.. ఈ ఎలుగు బంటి ఏం చేసిందంటే..


యువకుడిని కాపాడిన వ్యక్తి డీఎస్ నేగీ అని తెలిసింది. ఈయన నావికాదళంలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. కాగా, ఈ వీడియో వైరల్ అవవడంతో అంతా ఈ రిటైర్డ్ అధికారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘‘ఇలాంటి వారి వల్లే సమాజంలో మానవత్వం ఇంకా బతికి ఉంది’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి దేవుడిలా వచ్చి కాపాడాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

Updated Date - Jul 18 , 2024 | 07:06 PM

Advertising
Advertising
<