ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. గుండె ఆగిపోయే సీన్.. బైకర్‌ను వెంటబడిన ఖడ్గమృగం.. చివరకు ఏం చేసిందో చూస్తే..

ABN, Publish Date - Oct 01 , 2024 | 07:10 PM

క్రూర మృగాల దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు పులులు, సింహాలు, ఏనుగులతో తమాషాలు చేయబోయి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు, ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్న సందర్భాలనూ చూశాం. మరికొన్నిసార్లు..

క్రూర మృగాల దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు పులులు, సింహాలు, ఏనుగులతో తమాషాలు చేయబోయి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు, ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్న సందర్భాలనూ చూశాం. మరికొన్నిసార్లు అడవి జంతువులు జానావాసాల్లోకి చొరబడి మనుషులపై దాడులు చేయడం కూడా చూస్తుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డు పైకి వచ్చిన ఖడ్గ మృగం.. ఓ బైకర్‌పై దాడి చేసింది. వెంటబడి మరీ దాడి చేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన అసోంలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో చోటు చేసుకుంది. కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాకు చెందిన సద్దాం హుస్సేన్ (37) అనే వ్యక్తి బైకుపై అభరాణ్యం సమీపంలోని రోడ్డుపై వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఖడ్గమృగం అడవి నుంచి రోడ్డు పైకి వచ్చింది. దాన్ని చూడగానే వాహనదారులంతా ఎక్కడికక్కడ ఆగిపోయారు.

Viral Video: సింహాలను చూడటానికి సఫారీ వాహనాల్లో వెళ్తే.. చివరకు అవి చేసిన నిర్వాకం..


రోడ్డు పైకి వచ్చిన ఖడ్గమృగం చివరకు బైకుపై ఉన్న సద్దాం హుస్సేన్‌ను టార్గెట్ చేసింది. ఖడ్గమృగం దగ్గరికి రావడాన్ని చూసి భయపడ్డ అతను.. వాహనం దిగి రోడ్డు పక్క మైదానంలోకి పారిపోతాడు. అయితే ఖడ్గమృగం అతన్ని వదలకుండా వెంబడిస్తుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న మిగతా వాహనదారులు ఈలలు, కేకలు పెడుతూ దాన్ని తరిమే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే ఖడ్గమృగం (rhino attacked a biker) సదరు వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిపై దాడికి పాల్పడిన ఖడ్గమృగం అటు నుంచి అటే అడవిలోకి పారిపోయింది.

Viral Video: అది ఓడ అనుకున్నావా.. ఆర్టీసీ బస్ అనుకున్నావా.. ఇతడేం చేశాడో చూడండి..


ఖడ్గమృగం బారి నుంచి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాక.. చివరకు ప్రాణాలు పోయిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘అంత మంది ఉన్నా అతన్ని కాపాడలేకపోయారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎస్కలేటర్ ఎక్కిన యువతులు.. ఉన్నట్టుండి కిందకు దిగి ఏం చేశారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 01 , 2024 | 07:10 PM