ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పాము కాటుతో చనిపోవడంతో.. నీటిలో వేలాడదీశారు.. చివరికి రెండు రోజుల తర్వాత..

ABN, Publish Date - May 02 , 2024 | 08:03 PM

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ చాలా మంది మూఢనమ్మకాలను నమ్మి మోసపోతున్నారు. ఆఖరికి చదువుకున్న వారు, ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారు కూడా మూఢనమ్మకాలతో జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు...

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ చాలా మంది మూఢనమ్మకాలను నమ్మి మోసపోతున్నారు. ఆఖరికి చదువుకున్న వారు, ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారు కూడా మూఢనమ్మకాలతో జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాము కాటు కారణంగా ఓ యువకుడు చనిపోయాడు. అతడి మృతదేహాన్ని గ్రామస్తులు రెండు రోజుల పాటు నీటిలో వేలాడదీశారు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బులంద్‌షహర్ జిల్లా జైరాంపూర్ కుదేన్యా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోహిత్ కుమార్ ఏప్రిల్ 26న పొలంలో పని చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ పాము ఉన్నట్టుండి అతడిని కాటు (snake bite) వేసింది. దీంతో షాకైన అతను వెంటనే చికిత్స నిమిత్తం వైద్యుడి వద్దకు వెళ్లాడు. అయితే చికిత్స అందించినా అతడి పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు పరిస్థితి విషమించి అతను మృతి చెందాడు. అయితే.. పాము కాటుతో చనిపోయిన వారిని నీటిలో కట్టి వేలాడదీస్తే మళ్లీ బతికే అవకాశం ఉందని ఎవరో చెప్పిన మాటలను మృతుడి తల్లిదండ్రులు నమ్మారు.

Viral Video: స్విమ్మింగ్‌ఫూల్‌ను కబ్జా చేసి.. ఈ కోతులు చేస్తున్న నిర్వాకం చూస్తే..


గ్రామస్తులు కూడా ఇందుకు అంగీకరించడంతో చివరకు మోహిత్ కుమార్‌ మృతదేహాన్ని గ్రామానికి సమీపంలో (Hanging the dead body in river) ఉన్న గంగా నదిలో తాడుతో కట్టి వేలాడదీశారు. తద్వారా అతడి ఒంట్లోని విషం మొత్తం నీటిలోకి వెళ్లిపోతుందనేది వారి మూఢనమ్మకం. అందుకు తగ్గట్టుగానే మృతదేహానికి తాడు కట్టి రెండు రోజుల పాటు నదిలో వేలాడదీశారు. అయితే రెండు రోజుల తర్వాత చూసినా అతడిలో ఎలాంటి చలనమూ లేదు. దీంతో చివరకు మృతదేహాన్ని సమీపంలోని ఘాట్‌పై దహనం చేశారు. కొన్ని నెలల క్రితం హరిద్వార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Viral Video: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ఉన్నట్టుండి వాహనం అడుగున చూడగా.. ఎవరూ ఊహించని విధంగా..


జబ్బు చేసిన చిన్నారిని అతడి తల్లి గంగా నదిలో చాలా సేపు ముంచింది. అలా చేస్తే జబ్బు తగ్గిపోతుందని ఆమెకు ఎవరో చెప్పారట. ఇలా చేయడంతో జబ్బు తగ్గడం మాట అటుంచి.. చిన్నారి పరిస్థితి విషమించింది. కాగా, ప్రస్తుతం యువకుడి మృతదేహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాము కాటు వేయగానే పెద్దాసుపత్రికి వెళ్లి ఉంటే ప్రాణాలు దక్కేవి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, ‘‘కాటు వేయగానే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రోడ్డు పక్కన కాలువ నుంచి వింత శబ్ధాలు.. చివరకు ఏముందా అని మూత తెరచిచూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - May 02 , 2024 | 08:03 PM

Advertising
Advertising