ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:36 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంట్లో హాయిగా నిద్రపోవాలనే ఉద్దేశంతో బెడ్‌రూంలోకి వెళ్లాడు. అయితే తీరా మంచంపై పడుకునే సమయంలో దాని కింద నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. చివరకు..

ఇళ్లలో ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. సీలింగ్ నుంచి శబ్ధాలు రావడం, పగులగొట్టి చూస్తే తేనెటీగలు, మానిటర్ బల్లులు, కొండచిలువలు బయటికి రావడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హాయిగా పడుకుందానమి బెడ్ వద్దకు వెళ్లిన వ్యక్తికి.. మంచం కింద నుంచి శబ్ధాలు వినిపించాయి. ఏంటా అనుకుంటూ పరుపు తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంట్లో హాయిగా నిద్రపోవాలనే ఉద్దేశంతో బెడ్‌రూంలోకి వెళ్లాడు. అయితే తీరా మంచంపై పడుకునే సమయంలో దాని కింద నుంచి ఏవో శబ్ధాలు వినిపించాయి. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ ఏముందో కనుక్కునేందుకు చివరకు స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందించాడు.

Viral Video: ఇది కదా అసలైన హోమ్ డెలివరీ అంటే.. వీళ్లు చేస్తున్న పని చూస్తే.. అవాక్కవడం ఖాయం..


అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి మంచంపై ఉన్న పరుపును మెల్లగా పక్కకు తొలగించాడు. దాని కింద పరిశీలించగా ఓ నాగుపాము (cobra hiding under the mattress) బుసలుకొడుతూ బయటికి వచ్చింది. పరుపు కింద నక్కిన నాగుపామును చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్.. దాన్ని సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు.

Viral Video: బాబోయ్.. ఒట్టి చేతులతో సమోసాలు వేయించి.. చివరకు మరుగుతున్న నూనెతో ఏం చేశాడో చూస్తే..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా’.. అంటూ కొందరు, ‘‘పరుపు కింద నాగుపాము.. చూసుకోకుండా పరిస్థితి ఏంటో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. మొసళ్ల గుంపు మధ్యలో వ్యక్తి వాకింగ్.. కాలు మోపగానే అవి చేసిన పని చూడండి..

Updated Date - Aug 13 , 2024 | 03:36 PM

Advertising
Advertising
<