ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: పాము, ముంగిస పోరాటం.. పారిపోయి చిన్నారి ఊయల పైకి ఎక్కేసిన కోబ్రా.. చివరకు..

ABN, Publish Date - Jun 09 , 2024 | 09:40 PM

పాము, ముంగిసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ముంగిస చేతిలో పాము ఓడిపోవడమో, లేదా పాము చేతిలో ముంగిస ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. ఇలాంటి..

పాము, ముంగిసకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ముంగిస చేతిలో పాము ఓడిపోవడమో, లేదా పాము చేతిలో ముంగిస ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముంగిసతో పోరాడిన పాము.. చివరకు పారిపోయిన చిన్నారి ఊయల పైకి ఎక్కింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పాము, ముంగిస మధ్య ఉన్నట్టుండి పోరాటం మొదలవుతుంది. రెండూ చాలా సేపు పోట్లాడుకుంటాయి. ఈ క్రమంలో పాము ముంగిస నుంచి తప్పించుకుని పక్కకు పారిపోతుంది. దీంతో ముంగిస కూడా అక్కడి నుంచి పారిపోతుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పక్కకు పారిపోయిన పాము.. అక్కడే చిన్నారి ఊగుతున్న (snake climbed the cradle) ఊయల పైకి ఎక్కేసింది.

Viral video: మనిషిలా ప్రవర్తిస్తున్న మేక.. టీ గ్లాసు దగ్గర పెట్టగానే.. ఒక్కసారిగా..


అక్కడే ఉన్న వారు దీన్ని గమనించి పరుగు పరుగున అక్కడికి వెళ్తారు. పామును అక్కడి నుంచి దూరంగా పంపించేందుకు శబ్ధాలు చేస్తారు. అయితే అప్పటికే పాము ఊయల పైకి ఎక్కేయడంతో దూరం నుంచి నిలబడి చూస్తుండిపోతారు. ఊయల పైకి ఎక్కిన పాము.. పాకుతూ పాకుతూ ఊయల తాడుపైకి వెళ్లిపోతుంది. ఆ పక్కనే ఆరబెట్టిన దుస్తుల పైకి పాకుతూ వెళ్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral video: కూర ఉడుకుతుండగా ఖాళీ అయిన సిలిండర్.. చిన్న ట్రిక్‌తో వంట ఎలా పూర్తిచేశాడంటే..


అయితే ఆ సమయంలో చిన్నారి నిద్రపోతుండడంతో పాము సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్ల జలదరిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘చిన్నారికి ఏం కాలేదు.. థ్యాంక్స్ గాడ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఎంత వేడిగా ఉంటే మాత్రం బైకుపై ఇవేం ఏర్పాట్లురా బాబూ.. ఇలా ఎవరైనా చేస్తారా..

Read more!

Updated Date - Jun 09 , 2024 | 09:40 PM

Advertising
Advertising