ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Year Party : మీకిది తెలుసా.. న్యూ ఇయర్ పార్టీల్లో కొత్త రకం మందు..

ABN, Publish Date - Dec 30 , 2024 | 06:10 PM

న్యూ ఇయర్ పార్టీలంటేనే మందు, చిందు. చుక్కా, ముక్కా లేకుండా సెలబ్రేషన్స్ చేసుకునేవారు తక్కువే. పార్టీకి హాజరైనా కొంతమంది అలవాటులేక, ఆరోగ్యకారణాల రీత్యా మద్యానికి దూరంగా ఉంటూ వేడుకల్లో పూర్తిగా పాలుపంచుకోలేక నెర్వస్‌గా ఫీలవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో జరిగే పార్టీల్లో ట్రెండ్ అవుతున్నాయి.

Zero Free Non Alcoholic Drinks

న్యూ ఇయర్ పార్టీలంటేనే మందు, చిందు. చుక్కా, ముక్కా లేకుండా సెలబ్రేషన్స్ చేసుకునేవారు తక్కువే. పార్టీకి హాజరైనా కొంతమంది అలవాటులేక, ఆరోగ్యకారణాల రీత్యా మద్యానికి దూరంగా ఉంటూ వేడుకల్లో పూర్తిగా పాలుపంచుకోలేక నెర్వస్‌గా ఫీలవుతుంటారు. అలాంటి వారి కోసమే నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ అందుబాటులోకి వచ్చాయి. అచ్చం ఆల్కహాల్ టేస్ట్‌తో ఉండే ఈ బ్రాండ్స్ డ్రింకింగ్ మానేయాలనుకునే వారికీ బెస్ట్ ఆప్షన్. కొవిడ్ తర్వాత అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఇప్పుడు అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో నాన్ ఆల్కహాలిక్ న్యూఇయర్ పార్టీలు ట్రెండ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలామంది ఈ తరహా పార్టీలకే ఓటేస్తున్నారు.


దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. సోబర్‌, సోబ్రైటీ సిప్స్, క్యాట్‌వాక్ బొటానిక్స్ బ్రాండ్‌లు ప్రస్తుతం ఇండియాలో న్యూ ట్రెండ్. రుచిలో స్పిరిట్‌ని తలపించినా ఇందులో జీరో ఆల్కహాల్ ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు. హ్యాంగోవర్ ఫీలింగ్ రాదు. ఆల్కహాల్ అలవాటు తగ్గించుకుని ఫిట్‌నెస్, ఫ్యామిలీ, సేఫ్ డ్రైవింగ్‌పై ఫోకస్ చేయాలనుకునే వారి కోసం ఈ బ్రాండ్లు తీసుకొచ్చారు తయారీదారులు. ఇప్పటికే అరబ్ కంట్రీల్లో వీటి వినియోగం ఊపందుకుంది. మనదేశంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి తదితర నగరాల్లో జరిగే బిజినెస్ ఈవెంట్స్, ఫంక్షన్లు, రెస్టారెంట్లలో డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీలోని ప్రముఖ హ్యాంగ్ అవుట్ స్పాట్‌లు అయిన 'ద పిట్', 'మంకీ బార్‌'లు జీరో ప్రూఫ్ కాక్‌టెయిల్ మెనూలో చేర్చాయి.


జీరో ఫ్రీ ఆల్కహాలిక్ డ్రింక్స్ ధరలు..

ధరలు బ్రాండ్ బట్టి మారుతుంటాయి. 750 మి.ల్లీ నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్ బాటిల్ ధర సుమారు రూ.1200 ఉంటుంది. వినియోగదారుని ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకుని తయరుచేసిన ఆల్కహాల్ ఫ్రీ స్పిరిట్స్ ధరలో మాములు వాటితో పోలిస్తే కాస్త ఎక్కువే. అందుకే మినీ బాటిళ్లు అందుబాటులోకి తెచ్చాయి కంపెనీలు. ఇవి అన్ని బార్లలో దొరికే అవకాశం ఉండదు కాబట్టి ఆన్‌లైన్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. కొన్ని యాప్‌లలో ఇప్పటికే ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.


ఆరోగ్యపరమైన ఉపయోగాలు..

ప్రత్యేక పద్ధతిలో సహజ పదార్థాలతో తయారుచేసిన జిన్ నుంచి ఆల్కహాల్ పూర్తిగా తొలగించి నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ తయారుచేస్తారు. ఇది తాగినపుడు లిక్కర్, విస్కీ, రమ్, మాక్‌టెయిల్స్ వంటి పానీయాల వల్ల కలిగే హ్యాంగోవర్ కలగదు. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు తలెత్తవు. కూల్‌డ్రింక్స్‌లా ఉంటాయి కాబట్టి మద్యం తాగనివారు పార్టీల్లో ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చు. తాగే అలవాటు మానుకోవాలని కోరుకునేవారికి కూడా ఇది బెస్ట్ ఛాయిస్.

Updated Date - Dec 30 , 2024 | 06:55 PM