Viral Video: ఇదెక్కడికి విడ్డూరంరా బాబోయ్.. పెట్రోల్ బంకులో చలిమంట.. వీళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Dec 25 , 2024 | 09:30 PM
పెట్రోల్ బంకుల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు వాహనదారుల నిర్లక్ష్యం వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలకు పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో కొందరు ఫోన్లలో మాట్లాడితే.. మరికొందరు బంకుల్లోనే అగ్గిపుల్లలు వెలిగిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో..
పెట్రోల్ బంకుల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు వాహనదారుల నిర్లక్ష్యం వల్ల అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలకు పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో కొందరు ఫోన్లలో మాట్లాడితే.. మరికొందరు బంకుల్లోనే అగ్గిపుల్లలు వెలిగిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. పెట్రోల్ బంకులో చలిమంట వేసిన సిబ్బంది వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇదెక్కడికి విడ్డూరంరా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెట్రోల్ బంకులో (petrol station) సీన్ చూసి దారిన వెళ్లే వారంతా షాక్ అయ్యారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో ఫోన్లు మాట్టాడడం కానీ, సిగరెట్లు తాగడం కానీ నిషేధం. అలాంటి పనులు చేయొద్దంటూ హెచ్చరిక బోర్డులు కూడా పెడుతుంటారు. కానీ ఈ పెట్రోల్ బంక్‌లో మాత్రం ఏకంగా సిబ్బంది మొత్తం కలిసి కూర్చుని ఎంచక్కా.. చలిమంట వేశారు.
పెట్రోల్ పట్టే మిషిన్లకు సమీపంలోనే మంటలు వేసి మరీ, దాని చుట్టూ కూర్చున్నారు. అంతా సరదాగా మాట్లాడుకుంటూ (staff lighting fire in petrol station) చలికాచుకోవడం చూసి అటుగా వెళ్లే వాహనదారులంతా షాక్ అయ్యారు. చిన్న మంట కనిపించినా కంగారు పడే పెట్రోల్ బంకు సిబ్బంది.. అందుకు విరుద్ధంగా ఏకంగా చలిమంట వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ సమయంలో పెట్రోల్ బంకులో లైట్లు ఆర్పేసి ఉన్నాయి. బంకులో డీజిల్, పెట్రోల్ ఖాళీ అవడం వల్ల సిబ్బంది ఇలా ధైర్యంగా చలిమంట వేశారా.. లేదా బంకు పూర్తిగా మూసేశారా.. అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
Viral Video: దారి మధ్యలో ప్రేమ జంట.. వెనుకే నిలబడ్డ పెంగ్విన్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెట్రోల్ బంకులో చలిమంట.. వామ్మో.. ఇదేం విచిత్రంరా బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘పెట్రోల్ లేకపోవడం వల్ల ఇలా చేసి ఉండొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 2.33 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 25 , 2024 | 09:30 PM