ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో.. అవాక్కైన స్టూడెంట్..

ABN, Publish Date - Feb 18 , 2024 | 11:41 AM

పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయ్యేందుకు అభ్యర్థులకు హాల్ టికెట్ తప్పనిసరి. అందుకే హాల్ టికెట్‌లో తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయ్యేందుకు అభ్యర్థులకు హాల్ టికెట్ తప్పనిసరి. అందుకే హాల్ టికెట్‌లో తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు తప్పులు దొర్లుతుంటాయి. సంతకం సరిగా లేదనో, ఫొటో మ్యాచ్ అవడం లేదనో.. ఇలా ఎన్నెన్నో కారణాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పరీక్ష రాసే అభ్యర్థి ఫొటో ప్లేస్ లో అతని ఫొటో కాకుండా ఓ సెలెబ్రిటీ ఫొటో రావడంతో సదరు అభ్యర్థి స్టన్న్ అయిపోయాడు. వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లో నటి సన్నీలియోన్ ఫొటో కనిపించింది. అంతే కాకుండా కన్నౌజ్‌లోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీని పరీక్షా కేంద్రంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:05 గంటల వరకు పరీక్ష సమయంగా పేర్కొన్నారు. దీంతో హాల్ టికెట్ తీసుకోవాలనుకున్న అభ్యర్థి షాక్ అయ్యాడు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపాడు.


ఈ ఫొటోపై స్పందించిన యూపీపీఆర్బీ పరీక్ష కోసం దరఖాస్తు చేసిన సమయంలో తన ఫొటో కాకుండా మరో ఫొటోను అప్‌లోడ్ చేయడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించి, తప్పిదాన్ని సరిదిద్దింది. కాగా.. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష శనివారం ముగిసింది. 60,244 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 11:42 AM

Advertising
Advertising