Shoaib Malik: సనా జావేద్‌కు సంబంధించిన.. ఈ 7 విషయాలు మీకు తెలుసా...
ABN , Publish Date - Jan 21 , 2024 | 07:08 PM
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను షోయబ్ మాలికే స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ జంట ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది..
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను షోయబ్ మాలికే స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఈ జంట ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది సనా జావేద్ హిస్టరీ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ సనా జావేద్, ఆమెకు సంబంధించి ప్రధానంగా 7 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రెండో వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్.. 14 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చారు. చాలా రోజులుగా వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో షోయబ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న షోయబ్.. తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం నెటిజన్లు పాకిస్థాన్ నటి గురించి ఆరా తీస్తున్నారు. సనా జావేద్‌కు సంబంధించిన 7 ప్రధాన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.సనా జావేద్.. సౌదీ అరేబియాలోని జెడ్డాలో 1993, మార్చి 25న జన్మించింది. ఈమె 2012లో షెహర్-ఎ-జాత్ టెలివిజన్ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసింది. పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. రొమాంటిక్ డ్రామా ‘‘ఖని’’లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత సనాకు బాగా గుర్తింపు వచ్చింది.
2. సనా జావేద్ 2020లో కరాచీలో పాకిస్థాన్ గాయకుడు ఉమర్ జస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలానికే వారు విడిపోయారు. ఆ తర్వాత షోయబ్‌తో ప్రేమలో పడింది.తరచూ సినిమా ఫంక్షన్లతో ఇద్దరూ కలుస్తుండడంతో వీరి పరిచయం మొదలైంది.
3. షోయబ్ మాలిక్‌తో వివాహమైన వెంటనే తన పేరును సనా షోయబ్ మాలిక్‌గా మార్చేసుకుంది. సనా కంటే షోయబ్ వయసులో ఏకంగా 11 ఏళ్లు పెద్దవాడు.
4. సనా జావేద్.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు వీరాభిమాని. చాలా ఇంటర్వ్యూల్లో ఆమె వారి గురించి తరచుగా చెబుతూ ఉంటుంది.
5. షోయబ్.. సనా జావేద్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసి, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
6. సనా జావెద్ తాజాగా మోడలింగ్ రంగలోనూ అడుగుపెట్టింది. 2020లో టెలివిజన్ రియాలిటీ గేమ్ షో ‘జీతో పాకిస్థాన్ లీగ్’లో ఇస్లామాబాద్ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించింది.
7. సనా జావేద్ పూర్వీకులు మన హైదరాబాద్ వారే. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు.