Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ యువతి కాలక్షేపం.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..
ABN, Publish Date - Sep 25 , 2024 | 03:00 PM
బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేసే సమయంలో, ఎక్కి దిగే సమయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. అలాగే ..
బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేసే సమయంలో, ఎక్కి దిగే సమయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు అదే నిర్లక్ష్యం కారణంగా మోసాలకు గురవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రైల్లో కిటికీ పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు (train) ఎక్కిన యువతి (young woman) కిటికీ పక్కన కూర్చుంది. కాసేపటి తర్వాత తన ఫోన్ బయటికి తీసి, అందులో తనకు ఇష్టమైన వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
యువతి కిటీకి డోరు తెరిచి, తాపీగా ఫోన్ చూసుకుంటుండగా.. బయటి నుంచి ఆమెను గమనిస్తున్న ఓ వ్యక్తి అదును చూసి ఒక్కసారిగా (thief stole the young woman's phone) ఆమె ఫోన్ లాక్కుని పారిపోయాడు. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆమె షాకై.. ఒక్కసారిగా పైకి లేచి అతడిని పట్టుకునేందుకు పరుగెత్తుకుంటూ కిందకు వెళ్తుంది. ఆమె కంగారుగా వెళ్లడం చూసి వెనుక కూర్చున్న వ్యక్తి కూడా ఆమె వెనుకే పరుగెత్తుకుంటూ వెళ్తాడు.
Optical Illusion: మీ కంటికి ఓ పెద్ద పరీక్ష.. ఈ చిత్రంలో దాక్కున్న ఐస్‌క్రీంను కనిపెట్టండి చూద్దాం..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతికి షాక్ ఇచ్చిన దొంగ’’.. అంటూ కొందరు, ‘‘ఈ కెమెరామెన్‌కి చోరీ జరుగుతుందని ముందే ఎలా తెలుసో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..
Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..
మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 25 , 2024 | 03:01 PM